సర్పాసనం
పడగవిప్పిన త్రాచు పామువలె ఉంటుందీ ఆసనం. ఆసనం వేసే విధానం:
1. మకరాసనంలో విశ్రాంతిగా ఉండాలి.
2. పొట్ట ఆధారంగా రెండు కాళ్ళను చాచి పెట్టి రెండు పాదాలు దగ్గరగా ఉంచి నేలపై పడుకోవాలి.
3. చేతి వ్రేళ్ళను బంధించి రెండుచేతులు పిరుదులపైకి వచ్చేటట్లు గడ్డాన్ని నేలకు అనివ్వాలి.
4. నడుము కండరాలను ఉపయోగించి ఛాతీని వీలయినంత పైకి లేపాలి. వెనక పెట్టిన చేతులను వీలయినంత పైకి ఎత్తాలి.
5. శరీరాన్ని వీలయినంత ఎత్తుకు ఎత్తాలి.
6. చేతులను నెమ్మదిగా వెనుకనుంచి తొలగిస్తూ శరీరాన్ని యథాస్థితికి తీసుకురావాలి.
గమనిక: అధిక రక్తపోటు గలవారు, హృదయసంబంధ వ్యాధులున్నవారు ఈ ఆసనాలు
గురువు పర్యవేక్షణలో వేయాలి.
ప్రయోజనాలు:
ఆస్త్మా వ్యాధిగ్రస్తులకు ఈ ఆసనము వల్ల మంచి ఫలితాలుంటాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి