చెడు కొలెస్ట్రాల్ నివారించడానికి 5 మార్గాలు
![శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నివారించడానికి 5 మార్గాలు](https://www.ntnews.com/images/food-images/2020/09/26/lower_cholesterol_1601107012.jpg)
వోట్మీల్, వోట్‌బ్రాన్, హై-ఫైబర్ ఫుడ్స్ :
వోట్మీల్‌లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 5-10 గ్రాముల కరిగే ఫైబర్ మాత్రమే కలిగి ఉండటం వలన ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. కావాల్సిన ఫైబర్‌ను పొందడానికి ఒకటిన్నర కప్పు వండిన వోట్మీల్ తింటే సరిపోతుంది.
చేపలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు :
ఒమేగా -3లు అధికంగా ఉండే చేపలను తినడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు సహాయపడుతుంది. సాల్మన్, హాలిబట్, లేక్‌ట్రౌట్, హెర్రింగ్, ఆల్బాకోర్ ట్యూనా, సార్డినెస్, మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. చేపల కర్రీ కోసం కొవ్వు కలిగున్న ఎలాంటి ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు. చేపలను ఉడికించడం లేదంటే గ్రిల్ చేసుకొని తింటే మంచిది.
బాదం, వాల్నట్ :
బాదం, వాల్నట్ వంటి డ్రైఫ్రూట్స్ ఎల్‌డిఎల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉన్నందున అవి రక్త నాళాలను అతుక్కొని ఉంచడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ 45-50 గ్రా. నట్స్ తినాలని వైద్యులు సిఫార్సు చేశారు. ఇలా చేయడం వల్ల శరీరం నుంచి ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను సమర్థవంతంగా తగ్గించవచ్చు.
ఆలివ్ ఆయిల్ :
ఆలివ్ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి "చెడు” (ఎల్‌డిఎల్) కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరం నుంచి “మంచి” (హెచ్‌డిఎల్) కొలెస్ట్రాల్‌ను తగ్గించవు.
స్టెరాల్ ఫోర్టిఫైడ్ ఫుడ్స్ :
మార్కెట్‌లో అనేక రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉన్నాయి. పండ్ల రసాలు, పెరుగు వంటి ఇతర ఆహార పదార్థాలు అదనపు స్టెరాల్స్‌ను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను 10 శాతానికి పైగా తగ్గించగలవు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి