తాడాసనము
తాడిచెట్టు ఆకారంలో ఉండే ఆసనం కాబట్టి తాడాసనం అని అంటారు.ఇది బాడీ స్ట్రెచింగ్ లాంటిది.
1. పాదాలను 10 సెం.మీ. ఎడంగా పెట్టి శరీరానికి రెండువైపులా రెండు చేతులను పెట్టి నుంచుని ఉండాలి.
2. బరువును రెండు పాదాలపై సమంగా ఉండేటట్లుగా చూడాలి.
3. చేతులను రెండుచేతి వేళ్ళను ఒకదానితో ఒకటి బంధించి పైకెత్తాలి.
4. ఒక బిందువు వద్ద కేంద్రీకరించి సాధన చేసేవరకు అలాగే ఉంచాలి.
5. ఊపిరిని బాగా పీల్చి చేతులను సాగదీసి భుజాలను ఛాతీని పైకెత్తాలి.
6. కాలివేళ్ళ మీద నుంచుని మడమల నెత్తాలి.
7. బాలెన్స్ ఏ మాత్రము తప్పకుండా శరీరము మొత్తం పై నుండి క్రింద వరకు సాగదీయాలి. కొన్ని సెకన్ల కాలము అదే స్థితిలో ఉండాలి. నిశ్వాసించేటప్పుడు మడమలను కిందకి ఆన్చాలి.
8. కొన్ని సెకన్ల రిలాక్సయిన తరువాత మళ్లీ 5 నుండి 10 సార్లు చేయడం మంచిది.
ప్రయోజనాలు:
శారీరక మానసిక సమతుల్యత ఏర్పడుతుంది.
వెన్నెముక ప్రాంతంలో నరాలకు పటుత్వం కలుగుతుంది. ప్రేవులు, కండరాలు,పొట్ట సాగేటట్లు
చేస్తుంది. గర్భము ధరించిన స్త్రీలు మొదటి ఆరు మాసముల వరకు చేయొచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి