యోగాసనాలు వేసే ముందు ఏమి చేయాలి?
యోగాసనాలు వేసేముందు మొట్ట మొదటగా
మీరు చేయాల్సినవి
1. తెల్లవారుఝామున లేచి కాలకృత్యాలు తీర్చుకోండి.
2. ఆసనాలు వేసే ముందు గోరు వెచ్చటి నీటితో స్నానం చేయండి.
3. తెల్లవారుఝామున ఆసనాలు వేయండి. ఆ సమయంలో గాలిలో ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది. గాలి బాగా వచ్చే ప్రదేశం చూసుకుని వేయండి.
4. శబ్దాలు, గోలలు లేకుండా ఉండే ప్రదేశాన్ని ఎన్నుకోండి.
5. పలుచటి బట్ట నేలపై పరచి పద్మాసనం లేదా సుఖాసనం మీ ఇష్టం.
6. ప్రశాంతంగా కనులు మూసుకోండి.
7. మీ ధ్యాస శ్వాస మీద నిలపండి.
8. గాలి వదిలినిప్పుడు పొట్ట లోపలికి,పీల్చినప్పుడు ముందుకి వస్తుందో లేదో గమనించండి. (పొట్ట ద్వారా కాకుండా ఛాతీ ద్వారా గాలి పీలుస్తుంటే మీ శ్వాస సరిగా కాదని గమనించండి)
9. ముందుకి వంగే ఆసనాలు వేసినప్పుడు గాలిని వదులుతూ, వెనక్కి వంగి ఆసనాలు వేసేటప్పుడు గాలి పీల్చుతూ ఆసనాలు వేయండి. ముందుకు వంగే ఆసనాలు వేయగానే వెనక్కి వంగే ఆసనాలు కూడా వెంటనే వేయాలి.
10. ఆసనం ఎప్పుడూ నెమ్మదిగా వెయ్యాలి.
11. వేసిన ఆసనంలో కొద్ది సెకన్లు ఉండాలి.
12. ఆసనం వేసేటప్పుడు నెమ్మదిగా వేసి ఇంకా నెమ్మదిగా మామూలు పోజిషన్లోకి రావాలి.
13. కుంభకం చేసేటప్పుడు (బి.పి) అధిక రక్తపోటు ఉన్నవారు కేవలం పది సెకన్లు మాత్రమే చేయండి.
14. గాలి పీల్చటం, వదలటం లాంటి ఆసనాల్లో పైకి శబ్ధం వచ్చేలా వదలటం, పీల్చడం చేయకూడదు. ప్రతిదీ నెమ్మదిగా, సరళంగా ప్రశాంతంగా చేయాలి.
15. యోగసనాల వల్ల ఎన్నో జబ్బులు తగ్గుతాయి. అదే స్థాయిలో జబ్బులు పెరిగే అవకాశం ఉంది. మీ శరీర ఆరోగ్య పరిస్థితి బట్టి ఆసనాలునిర్ణయించుకుని
చేయండి.
16. ఏ ఆసనం అయినా సరే రొప్పుతూ, ఆయాస పడుతూ చేయకండి. మీ బాడీ కెపాసిటిని గుర్తించి అంతసేపే ఉండండి.
17. యోగలో ముందు ఆసనాలు, ప్రాణాయామం మధ్య, ధ్యానం చివర ఉండాలి.
18. మీరు ఎంతసేపు యోగ చెయ్యాలో నిర్ణయించు కున్న సమయాన్ని 3 భాగాలుగా చేసుకుని
1) మస్క్యులర్ యోగ (Muscular yoga): కండరాలను ప్రధానంగా పనిచేయించే యోగ
2. రెస్పిరేటరి యోగ (Respiratory yoga) : ఊపిరితో చేసే యోగ
3) మెంటల్ యోగ (Mental yoga) : మనసుతో చేసే యోగ. ఈ మూడు కవర్ అయ్యేలా చూసు కోండి. అప్పుడే యోగ తాలూకూ పరిపూర్ణమైన
ఫలితాన్ని పొందగలరు.
19. ప్రతి ఆసనానికి ముందు వెనుక, రిలాక్స్ కోసం దండాసనం లేదా శవాసనం తప్పనిసరిగా వేయండి. ఆసనం వేసేటప్పుడు అలసట వస్తే శవాసనం 2 నిమిషాలు వేసి ఆపై ఆసనంలోకి వెళ్ళండి. 8 నుంచి 60 సంవత్సరాల వాళ్ళు మాత్రమే యోగ
చెయ్యాలి.
20. యోగలో గుర్తు పెట్టుకోవాల్సిన మరో ముఖ్యమైన సంగతి ఆసనంలోకి ఎలా
వెళ్ళామో అలాగే వెనక్కి రావాలి.
21. ఆసనం వేసేటప్పుడు మీ ధ్యాస శ్వాసమీద నిలిపి కనులు మూసుకుని నెమ్మదిగా ఆసనం పూర్తి చేయండి.
22. ఆసనం వేసినప్పుడు, కనులు మూసుకున్న ప్పుడు పళ్ళు బిగపట్టడం, మొహాన్ని బిగించడం చేయకండి. ప్రశాంతతకు ప్రతి రూపంలా ఉంచండి.
23. ఆడవాళ్ళు ఆసనాలు సమయంలో బిగుతు బట్టలు బ్రాలు, జాకెట్స్ లాంటివి ధరించకుండా వదులు డ్రస్ వేసుకుని చేయాలి.
24. అలాగే ఆడవాళ్ళు మయూరాసనం, పూర్ణ మత్స్యాసనం వేయరాదు. అలాగే అనారోగ్య సమయంలో కూడా ఆసనాలు వేయకండి.
25. ఆసనాలు వేయటానికి ముందు సుమారుగా 3 గంటలు ముందు ఘన పదార్థాలు తీసుకుని ఉండాలి. అలాగే ద్రవ పదార్థాలు, కాఫీ, టీ, పాలు లాంటివి అరగంట ముందు తీసుకుని ఉండాలి.
26. యోగ ప్రాక్టీసెస్ ఆసనాలు ముందు ఆపై ప్రాణాయామం చివరగా ధ్యానం ఉండాలి.
27. హృద్రోగము, ఉబ్బసము ఉన్నవారు యోగ మాస్టర్ సారధ్యంలో యోగ ప్రాక్టీస్ చేయ్యాలి.
28. యోగ చేసేటప్పుడు సాధకులు ఆభరణములు, వస్తువులు ధరించరాదు.
29. యోగ సాధన అయ్యాక ఏ ఆహారం తీసుకోవాలన్నా ద్రవ పదార్థాలకి 20 నిమిషాలు, ఘన పదార్థాలు 40 ని||ల గ్యాప్ ఉండాలి.
30. ఆసనం సమయ ది బెస్ట్ ఉదయం 5-30 ని||ల నుండి 6-30 లేదా 6-30 నుండి 7-30 .ఈ సమయంలో మంచి గాలి లభిస్తుంది. వీలుకాని వాళ్ళు సాయంత్రం 5-30 నుండి 6-30 ఈ రెండు సమయాలు సరైనవి.
మైథిలీ వెంకటేశ్వరరావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి