ఉష్ట్రాసనము
ఈ ఆసనంతో శరీరంలోని పిక్కలు గట్టిగా వజ్రంలా తయారవుతాయి.
1. వజ్రాసనంలో కూర్చోవాలి
2. మోకాళ్ళపై నిలబడి ఊపిరిపీల్చుతూ శరీరము వెనకకి వంచాలి.
3. నెమ్మదిగా కుడిచేతిని అరికాలిమీద, ఎడమచేతిని ఎడమ అరికాలు మీద
వచ్చి ఉంచాలి. ఉదరభాగాన్ని వీలయినంతవరకు ముందుకి తీసుకువస్తూ తొడలను వంచటానికి ప్రయత్నిస్తూ తలను వెన్నెముకకి సాధ్యమైనంత వెనకకి వంచాలి. శరీరభారం మొత్తం కాళ్ళమీద చేతుల మీద ఉంటుంది.
4. వీలయినంత వరకు ఈ స్థితిలో ఉండాలి.
5. నెమ్మదిగా ఒక చేతిని ఒక మోకాలిని నుంచి వేరొక చేతిని వేరొక మోకాలి నుంచి విడదీయాలి.
పై ప్రకారంగా 3 సార్లు చేయాలి.
గమనిక: విపరీతమైన నడుము నొప్పి గలవారు సరైన గురువు ఆధ్వర్యంలో తప్ప వేయరాదు.థైరాయిడ్ గ్లాండ్ వ్యాకోచము చెందినవారు ఈ ఆసనము వేయరాదు.
ప్రయోజనాలు:
జీర్ణక్రియ, పునరుత్పత్తి విధానాలకు అనుకూలం. పొట్టప్రేవుల్ని సాగదీసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. వెనకకి వంగుట వలన వెన్నెముక నరాలకి సామర్ధ్యము పెరిగి, నడుము నొప్పి, భుజాలనొప్పిని నివారిస్తుంది. మెడ నరాలు, సాగదీయటం వలన థైరాయిడ్ గ్రంథిని ఏక్టివేట్ చేస్తుంది. మెడనొప్పి (సర్వైకల్ స్పాండిలైటిస్)
గల వారికి ఈ ఆసనము ఎంతో ప్రయోజనకారి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి