త్రికోణాసనం
కాళ్ళ మధ్యలో ఒక కోణం - వీపుకి రెండు చేతుల మధ్య రెండు కోణాలు టోటల్ గా మూడు కోణాలు కలిగిందీ ఆసనం.
1.స్థిరంగా నిలబడాలి.
2. కాళ్ళను వీలయినంత దూరంగా ఉంచాలి.
3. చేతులు మెల్లగా ప్రక్కల నుంచి పైకెత్తి భుజాల వరకూ తీసుకుని రావాలి.
4. గాలిని మెల్లగా వదులుతూ ముందుకు వంగాలి.
5. నడుముని మెల్లగా ఎడమ వైపుకి తిప్పుతూ కుడిచేతితో ఎడమపాదాన్ని పట్టుకోవాలి.
6. ఎడమ చేతిని మెల్లగా పైకిలేపి, తిన్నగా ఉంచాలి. ఇలా చేసేటప్పుడు రెండు చేతులు, ఒకే లైనుగా ఉండాలి.
7. మెల్లగా మెడని పైకి ఎత్తి ఎడమ చేతి వైపు త్రిప్పి ఎడమ చేతిని చూస్తూ ఉండాలి.
8. ఇదేవిధంగా కొన్ని సెకన్ల వరకూ ఉండాలి.
9. తిరగి మనం యథాస్థితికి రావాలి.
10. కొంత సేపు రిలాక్స్ గా ఉండి ఎడమచేతితో కుడిపాదాన్ని తాకాలి.
ఈ విధంగా 5 సార్లు చేయడం మంచిది.
ప్రయోజనాలు:
శరీరం మొత్తం టోనప్ అవుతుంది.
ఈ ఆసనం వేస్తే కాళ్ళ కండరాలు స్ట్రెచ్ అవుతాయి. జీర్ణవ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి