భుజంగాసనము
పడగ విప్పిన పాము వలె ఉంటుందీ ఆసనం.అందువల్లే భుజంగాసనం అన్నారు.
1. మకరాసనములో విశ్రాంతిగా ఉండాలి.
2. మడమలను బొటన వేళ్ళను కలిపి బోర్లాపడుకోవాలి.
3. గడ్డాన్ని నేలకు ఆనించాలి.
4. అరికాళ్ళు పై వైపునకు తిరిగి ఉండాలి
5. మోచేతులను వంచి అరచేతులను ఆఖరి ప్రక్కటెముక ప్రక్కన ఉంచాలి.మోచేతుల
ను దగ్గరగా ఉంచాలి. చేతులపై ఎక్కువ బలము పెట్టరాదు.
6. తల పైకెత్తుచూ పాము పడగెత్తినట్లు శరీరము నెమ్మదిగా పైకెత్తాలి. నాభిస్థానము నేలను తాకి తాకనట్లుండాలి.
7. మరలా తిరిగి మకరాసనములోకి వచ్చేయాలి.
గమనిక:
హెర్నియా, పెప్టిక్ అల్సర్ గలవారు ఈ ఆసనము వేయరాదు.
ప్రయోజనాలు:
వెన్నెముక స్ప్రింగులాగా తయారవుతుంది.
వీపు నొప్పి వుంటే తగ్గిపోతుంది.
ఉబ్బసం ఉంటే తగ్గుతుంది.
మూత్రపిండాల పై భాగాన ఉండే ఎడ్రినల్ గ్రంథులు చురుగ్గా పనిచేయటానికి సహకరించగల థైరాయిడ్ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి