ఖనిజ లవణాలు (మినరల్స్)


           దేహానికి అవసరమైన ఖనిజలవణాలు పుష్కలంగా ఉండేది ఆకుకూరల్లోనే. ఎందుకంటే స్తున్నం, భాస్వరం, ఉప్పు, ఇనుము తదితర ఖనిజలవణాలను సరాసరి స్వీకరించి, జీర్ణించుకునే శక్తి మనకు లేదు. ప్రకృతి ఆ శక్తిని వృక్షాలు, మొక్కలకు ఇచ్చింది. ఖనిజ లవణాలను అవి స్వీకరించి, సేంద్రియ లవణాల రూపంలో కాండా లలోను, ఆకులలోను, కాయలలోను, పండ్లలోను, పూలు, దుంపలతోను పదిలపరచుకుంటాయి.
వాటిని మనం ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
        ఆకుకూరలలో ఇనుము విశేషంగా ఉంటుంది. ఎ,బి,సి,డి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.
అందువలన ఆకుకూరలను దేహ రక్షక పదార్ధాలుగా పరిగణిస్తుంటారు. ఆకుకూరలలో గల మాంసకృత్తులు పదార్థము సులభంగా జీర్ణమై, త్వరగా శరీర కణాలలో కలిసిపోవు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతిమనిషికి సగటున రోజుకు 120 గ్రాముల  ఆకుకూరలను ఆహారంగా తీసుకోవాలని 
వైద్యులు అంటున్నారు.

ప్రయోజనాలు

        బలవర్ధకమైన ఆహారం కావలసిన వారికి ఆకుకూరలు సహాయపడతాయి.

• వ్యా ధి ఉధృతిని తగ్గించటానికి, తిండి ఎక్కువై వ్యాధులు వచ్చిన వారికి ఆకుకూరలు
సహాయపడతాయి.

. ఆకుకూరలు కన్నా కాయగూరలే మంచివి.
ఎండలో కాష్టం చేసే వారికి ఆకుకూరలు అనవసరం. అనగా సూర్యరశ్మి సూటిగా తగలని వారిలో
(కార్యాలయాల్లో పనిచేసేవారికి) సేంద్రియ లవణాల కొరతను ఆకుకూరలు పూరిస్తాయి, అటువంటి
వారికి ఆకుకూరలు అవసరం.

• మధుమేహము, పక్షవాతము, స్థూలకాయము తదితర వ్యాధులకు పిండిపదార్ధాలు ఎక్కువగా
తినడం ఒక కారణం.ఇలాంటి వారికి అన్నానికి బదులుగా ఆకుకూరలు మేలు చేస్తాయి.

• చక్రవర్తి కూర, పెరుగు తోటకూర, బచ్చలి మొదలైనవి వేడిని తగ్గిస్తాయి. మిగిలిన ఆకుకూరలకు వేడిని కలుగజేసే గుణం ఉంది.ఆకుకూరలను తరగకముందే నీటిలో కడగాలి. కడిగిన తర్వాత తరగకూడదు, ఆకుకూరలను తక్కువ మంటమీద తక్కువ నీటిలో ఉడికించాలి. ఉడికించగా మిగిలిన నీటిని పారబోయకూడదు. వీలైతే తాగాలి. లేకపోతే ఇగురులోకాని, పప్పులోగాని, చారులో గాని కలుపుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. పిల్లలకు నేరుగా ఆకుకూరలు తిననప్పుడు ఈ విధంగా పప్పులో కలిపి పెడుతుంటే అన్ని పోషకాలు సమగ్రంగా అందుతాయి.
          

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid