ప్రొటీన్లు కావాల్సిందే.



          

         మహిళలతో పోలిస్తే మగవాళ్ల శరీర నిర్మాణమే వేరుగా ఉంటుంది. వీళ్లలో కొవ్వు కంటే కండరాల మాస్ ఎక్కువ. దీనివల్లే ఆడవాళ్ల కంటే ఎక్కువ శారీరక శ్రమని చేసే శక్తి ఉంటుంది వీళ్లలో.అందుకని ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడాలి.
         సహజంగా ఉండాల్సిన శరీరబరువులో ఒక్క కేజీకి, 0.85 గ్రాముల చొప్పున ప్రొటీన్ ఉండాలి. చేసే పని, వయసు బట్టి మగవాళ్లు తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉండాలంటే...
         యుక్త వయస్కులు ఈ వయసులో శరీర ఎదుగుదల, ఎముకల పొడవు, వెడల్పు, మందం పెరుగుదల వంటివి జరుగుతుంటాయి. ఈ వయసులోనే కండరాలు పెరిగి శరీరానికి ఒక ఆకృతి
ఏర్పడుతుంది. కండరాలు తయారవ్వడం వల్ల ప్రొటీస్, ఐరన్లు ఎక్కువ మొత్తంలో అవసరం పడతాయి. ఎముకలు శాశ్వతంగా పెరిగేందుకు
క్యాల్షియం కూడా కావాల్సి ఉంటుంది. రోజూవారీ
పనులతో పాటు శరీరంలోపల జరిగే ఈచర్యలన్నింటి కోసం అధిక మొత్తంలో శక్తి అవసరమవుతుంది.
సాధారణంగా ఈ వయసు అబ్బాయిలు కాలేజీకి వెళ్తుంటారు. ఈ వయసు పిల్లలు చాలావరకు అల్పాహారం తినరు. బయటి ఆహారం ఎక్కువగా
తింటుంటారు. పాస్టపడ్, సాఫ్ట్ డ్రింక్ మీద ఎక్కువగా ఆధారపడుతుంటారు. వీటితోపాటు సిగరెట్లు, మద్యపానం వంటివాటికి ఆలవాటుపడుతుంటారు కూడా.

ఏ ఆహారం తినాలంటే....

        గుడ్లు, చేప, చిరుధాన్యాలు, నట్స్ వంటి ప్రొటీన్లు ఆహారంలో తప్పక ఉండాలి. ఎనర్జీ డ్రింక్లు తాగే బడులు బియ్యం, గోదుమల వంటి తృణ ధాన్యాలను తింటే జీలంత శక్తి వస్తుంది. రోజుకి కనీసం రెండు పండ్లు, మూడు రకాల కూరగాయలు తినాలి.

• బ్రేక్ ఫాస్ట్ను కచ్చితంగా తినాలి. అసలు మానకూడదు. ఇది మీ ఎత్తు, ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది.

• ఇంట్లో వండిన ఆహారాన్నే తినాలి. ఒకవేళ బయట తినాల్సి‌వస్తే నూనె పదార్థాలు తినకుండా మజ్జిగ తాగాలి. కాలేయ సంబంధిత సమస్యలు రాకుండా సురక్షితమైన మంచి నీటిని మాత్రమే తాగాలి.

• పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవి జీర్ణవ్యవస్థ, వ్యాధినిరోధక వ్యవస్థల పై చెడు ప్రభావం చూపుతాయి. అలాగే మెదడు ఎదుగుదల మీద ప్రభావంచూపెడతాయి.

20-40 యేళ్ల మధ్య

ఈ వయసు వాళ్లు ఏ ఉద్యోగం చేసినా మొదట్లో పూర్తి శక్తితో ఉంటారు. అందుకని వీళ్లు ఆహారాన్ని సమతులం చేసుకుంటూ, సరైన సమయానికి నిద్రపోతూ, శారీరకంగా చురుకుగా ఉంటే సరిపో
తుంది.

తీసుకోవాల్సిన ఆహారం..

         ప్రతిసారీ ఆహారంలో తృణధాన్యాలైన గోధుమలు లేదా బియ్యం, చిరుధాన్యాలు, కాయగూరలు, పళ్లు, పెరుగు తప్పక ఉండాలి.
బయట తింటే నూనె, ఉప్పు ఉన్న పదార్థాలను తినకూడదు. మజ్జిగ ఎక్కువగా తాగాలి.



డా.జానకి,న్యూట్రిషనిస్టు,హైదరాబాద్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid