పిండిపదార్థాలు(కార్బోహైడ్రేట్స్)


       

       పిండి పదార్థాలను ఆంగ్లంలో కార్బోహైడ్రేట్లు అంటారు. నిజానికి పిండి పదార్థం - అంటే starchy substance - ఒక రకం కర్బనోదకం. పిండి పదార్ధాలు, చక్కెరలు, పిప్పి పదార్ధాలు, మొదలైనవన్నీ కర్బనోదకాలకి ఉదాహరణలే. కార్బోహైడ్రేట్లు అంటే కార్బన్ యొక్క హైడ్రేట్లు అని అర్థం. కార్బోహైడ్రేట్లు అనే పేరు వల్ల ఇవి కార్బన్, నీరు (హైడ్రేట్) సంయోగ పదార్థాలనే అర్థం వస్తుంది. కార్బోహైడ్రేట్లను శాకరైడులు అని కూడా పిలుస్తారు.
 గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ (చక్కెర), లాక్టోజ్, సెల్యులోజ్, స్టార్చ్ (పిండి పదార్థం) కార్బోహైడ్రేట్లకు కొన్ని ఉదాహరణలు. వీటిని పిండి పదార్థాలు (బియ్యం, పప్పు ధాన్యాలు, ఆలుగడ్డలు, రొట్టె) లేదా చక్కెరలు (పటిక బెల్లం, జామ్, స్వీట్స్ లాంటివి) రూపంలో మనం ఆహారంగా తీసుకుంటాం. 
 పంచదారకీ, పిండికీ బాహ్య లక్షణాలలో తేడాలు ఉన్నప్పటికీ వాటి రెండింటిలోనూ మూడే మూడు మూలకాలు దాదాపు ఒకే నిష్పత్తిలో ఉన్నాయని గే-లుసాక్‌ కనుగొన్నారు: 45 శాతం కర్బనం (carbon), 6 శాతం ఉదజని (hydrogen), 49 శాతం ఆమ్లజని (oxygen). అంటే ఒక పాలు ఉదజనికి సుమారు ఎనిమిది పాళ్ళు ఆమ్లజని ఉంది. నీటిలో కూడా ఈ మూలకాల నిష్పత్తి ఇంతే. అంటే పంచదార లోనూ, పిండి లోనూ కర్బనం (బొగ్గు) తో పాటు నీరు ఉందన్న మాట. లేదా పంచదార, పిండి పైకి తెల్లగా ఉన్నా, అవి నీరు పట్టిన బొగ్గు! లేదా, చెమర్చిన బొగ్గు. ఈ చెమర్చిన బొగ్గుని గ్రీకు భాషలో 'కార్బోహైడ్రేట్‌' అంటారు. అదే ఇంగ్లీషులోకి దిగుమతి అయింది. దీనిని  తెలుగులో కర్బనోదకం (carbohydrate) అనొచ్చు.

       పిండిపదార్ధాల పేర్లన్నీ "-ఓజు" శబ్దంతో అంతం అవాలని ఒక అంతర్జాతీయ ఒప్పందం ఉంది. ఉదాహరణకి కర్బనోదకాలన్నిటిలోనూ అతి చిన్న అణువు గ్లూకోజు రక్తంలో ఉండే చక్కెర .
పళ్ళకి తీపినిచ్చేది ఫ్రూక్టోజు (ప్రూట్ అంటే పండు, ప్రూట్ + ఓజు = ఫ్రూక్టోజు). మనం సాధారణంగా కాఫీ, టీ లలో వేసుకునేది సుక్రోజు. పాలకి తియ్యదనాన్నిచ్చేది లేక్టోజు. మన జన్యు పదార్థంలో ఉండేది రైబోజు. పీచు, పిప్పి పదార్ధాలలో ఉండేది కణోజు (కణం + ఓజు = కణోజు, లేదా సెల్‌ + ఓజు = సెల్యులోజు). మనం ఏ భాషలో మాట్లాడినా, ఏ కొత్త పేర్లు పెట్టినా అర్థమయితేచాలు.అదే విధంగా కుడిచేతి వాటం ఉన్న చక్కెరలని డెక్‌స్ట్రోజు (dextrose) అనీ, ఎడమ చేతి వాటం ఉన్న చక్కెరలని లీవోజు (levose) అనీ అంటారు. (లేటిన్‌లో Dextro అంటే కుడి, levo అంటే ఎడమ.) వీటిని కావలిస్తే మనం దక్షిణోజు, వామోజు అని అనొచ్చు.

మాంసకృత్తులు, కొవ్వులు ఇంటికి వాడే ఇటుకలు, సున్నం లాంటివి. పిండిపదార్ధాలు  కాలే ఇంధనం (fuel) లాంటివి. శరీరంలో జీవకణాల నిర్మాణానికి కణజాల (lissue) నిర్మాణానికి ప్రొటీన్లు (మాంసకృత్తులు),కొవ్వులు అవసరం, శక్తిని ఇవ్వటానికి పిండిపదార్ధాలు అవసరం. పిండిపదార్ధాలు జీవి మనుగడకి తప్పనిసరి కాదు.
అవి   లేకుంటే  శరీరం  కొవ్వుల నుండి,
ప్రొటీన్ల నుండి శక్తి ని తయారుచేసుకో కలదు.
స్థూలకాయంతో (obese) కాని, డయబెటీస్ (diabetes)తో కాని బాధ పడే ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతూన్న ఈ రోజులలో పోషకాహారం (diet) ఎటువంటిది తినాలన్నది ఒక జటిలమైన ప్రశ్నగా మారింది.
      సంపన్న దేశాలలో ప్రజలు తమకి కావలసిన శక్తిలో 40 నుండి 65 శాతం మేరకి పిండిపదార్ధాల నుండి లభించేలా చూసుకోవాలని ఒక మార్గదర్శిక సూచిక (guideline) ఉంది.
        ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization)  మనకు లభించే శక్తిలో 55 నుండి 75 శాతం మేరకి పిండిపదార్ధాల నుండి పొందాలని చెప్పారు. అంటే 10 శాతం   చక్కెర, గ్లూకోజు నుండి , మిగిలినవి ధాన్యాలు, పళ్ళు, రొట్టెలు, మొదలైన పిండి పదార్ధాలు  ఉండాలని సిఫారుసు చేశారు. 
      ఆరోగ్య పరిరక్షణకి  ఏయే పదార్థాలు తింటే రక్తంలో గ్లూకోజు  ఎంతెంత పెరుగుతుందో తెలిస్తే అప్పుడు ఏయే వస్తువులు తింటే మంచిదో తేల్చి చెప్పాచ్చు. ఈ కోణంలో ఆలోచించి కొందరు గ్లైసీమిక్ సూచిక (glycernic index) అని ఒక కొత్త సూచిక ని ప్రవేశ పెట్టారు. 

ఆహార                     శక్తి (ప్రతి వందగ్రాములకు
పదార్థాలు                       కిలో కేలరీలలో)

బియ్యం                                345
గోధుమ పిండి                        341
జొన్న                                    349
సజ్జలు                                  361
రాగి                                      328
మొక్కజొన్న                           342




కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid