స్థూల కాయం మరియు పోషణ





         శరీరంలో కొవ్వు అధికంగా చేరడం వల్ల ఏర్పడే పరిస్థితిని స్థూలకాయం అంటారు, వాంఛనీయమైన లేదా ఉండవలసిన దానికన్న 20 శాతం ఎక్కువగా శరీరం బరువు గల వారిని స్థూలకాయులు అనవచ్చు.
          స్థూలకాయం ఆరోగ్యపరమైన ఎన్నో దుష్ఫలితాలను కలిగిస్తుంది. అకాల మరణానికి దారితీయవచ్చు. అధిక రక్త పీడనం, రక్తంలో ఎక్కువగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు చేరడం,
గుండెజబ్బు,మధుమేహం,పిత్తాశయంలో రాళ్లు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాలు స్థూలకాయం వల్ల ఎక్కువవుతాయి.

కారణాలు :

          అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం,   శారీరకంగా   తక్కువగా   శ్రమపడటం
స్టులకాయానికి దారితీస్తుంది.
       తాము ఆహారం ద్వారా తీసుకొనే శక్తికి, వివిధ పనుల ద్వారా ఖర్చు పెట్టే శక్తికి మధ్య సమతుల్యం
లేనప్పుడు స్థూలకాయం లేదా అధిక బరువు ఏర్పడుతుంది.
        ఆహారంలో కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా స్థూలకాయం వస్తుంది.
వ్యక్తి సంక్లిష్టమైన నడవడిక, మానసిక పరిస్థితి కూడా అతను అధికంగా ఆహారం తీసుకోవటానికి
కారణం అవుతాయి. ఫలితంగా ఇది స్థూలకాయానికి దారితీస్తుంది.

సరైన ఆహారం తీసుకోవడంలో మనం చేసే పొరపాట్లు దేహంలో కొవ్వు చేరడానికి దోహద పడతాయి. 
         బాల్యం, కౌమార దశలో శరీర బరువు ఎక్కువగా ఉంటే అది వారు పెద్దవాళ్ళైన తరువాత
స్థూలత్వానికి దారితీస్తుంది.

• గర్భధారణకు ముందు, తర్వాత రుతుక్రమం (ముట్టు) ఆగిపోయిన తర్వాత మహిళల్లో స్థూలకాయం ఏర్పడుతుంది.

శరీర బరువును తగ్గించడం ఎలా?

నూనెలో వేయించిన (ప్రై చేసిన) ఆహార పదార్ధాలను తక్కువ తినాలి. పండ్లు, కూరగాయ లను అధికంగా తినాలి.
పీచు (ఫైబర్) పదార్థం ఎక్కువగా ఉండే ప్రధాన గింజ ధాన్యాలు, పప్పులు, మొలకెత్తిన ధాన్యాలను
ఎక్కువగా తీసుకోవాలి.
క్రమం తప్పని వ్యాయామం ద్వారా శరీర బరువును పరిమితులలో ఉంచాలి.
శరీరం బరువు తగ్గి పద్దతులేవైనా నిదానంగా, స్థిరంగా ఉండాలి.
తరచుగా ఉపవాసం చేయడం ఆరోగ్యపరమైన దుష్ఫలితాలకు దారితీస్తుంది. 
మీ శారీరక పనులకుతగిన విధంగా అవసరమయ్యే వివిధ రకాల ఆహార పదార్థాలను తీసుకోండి,
తక్కువ పరిమాణంలో భోజనాన్ని ఎక్కువ సార్లు తినండి.
చక్కెర, కొవ్వు పదార్థాలకు, మద్యపాన సేవనానికి దూరంగా ఉండండి.
తక్కువ కొవ్వుగల పాలను వాడండి.
బరువు తగ్గించే ఆహారంలో మాంసకృత్తులు ఎక్కువగాను, పిండిపదార్ధాలు (కర్బోహైడ్రేట్లు), క్రొవ్వు తక్కువగాను ఉండాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid