Flaxseeds Benefits

PC: TV9 telugu అవిసె గింజల రుచిలో పెద్ద ప్రత్యేకత ఏమీ లేకపోయినా ఈ గింజలను మాత్రం సూపర్‌ఫుడ్ అని అంటారు ఆరోగ్య నిపుణులు. వీటిల్లో విటమిన్లు , ప్రోటీన్ , ఆమ్లాలు వంటి పోషకాలు అనేకం ఉన్నాయి. అవిసె గింజలు ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయగల వని ప్రముఖ డైటీషియన్ తమర్ శ్యామ్యూల్ చెప్పారు. ఇక “ఎక్కడైతే ప్రజలు అవిసె గింజలను తమ రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటారో, అక్కడ చక్కటి ఆరోగ్యం వెల్లివిరుస్తుందని” మహాత్మాగాంధీ ఏనాడో అన్నారు. నిజమే.. ఈ చిరు గింజలలో పలు ప్రయోజనాలున్నాయి. వంటకాల్లో ఉపయోగించడానికి సులభమైనవి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, అవిసె అత్యంత శక్తివంతమైనది. 1. అవిసె గింజల్లో మేలురకం కొవ్వులు, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికం. చేపలలో ఉండే ఆరోగ్యకరమైన ఒమేగా -3 అవిసె గింజల్లో ఉంటాయని డైటీషియన్ జెన్నిఫర్ మిమ్ఖా చెప్పారు. 2 ఈ గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. 3. అవిసె గింజలలో ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు ఉంటాయని శ్యామ్యూల్ చెప్పారు. అందువల్...