మంచి కొవ్వు



కొవ్వులంటే మనకు భయం. అవి గుండెకు ఎక్కడ చేటు చేస్తాయేమోనని భయపడతాం. నడి వయసు దాటాక ఆహారంలో కొవ్వు పదార్థాలను చాలా వరకూ తగ్గించేస్తుంటాం. నిజానికి అన్ని విషయాల్లో మంచి, చెడూ ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ మనకు మంచి చేసేవి, చెడు చేసేవి ఉన్నాయి. చెడు కొవ్వుల్ని ఎల్‌డీఎల్‌ అని, మంచి కొవ్వుల్ని హెచ్‌డీఎల్‌ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉండాలి, మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మరి మంచి కొలెస్ట్రాల్‌ పెరగడానికి మనం ఏం తినాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. మంచి కొవ్వును పెంచుకునే మార్గాల గురించి తెలుసుకుందాం..

ఎన్నో సమస్యలకు మూలస్తంభం.. స్థూలకాయం


మధుమేహం నుంచి మొదలుపెడితే అధిక రక్తపోటు, గుండె జబ్బులు, థైరాయిడ్‌, మోకాళ్ల నొప్పులు ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో సమస్యలకు కారణం స్థూలకాయమే. అయితే దీనికి కారణం శరీరంలో కొవ్వు కొండలా పేరుకుపోవడమే.  ఇలా శరీరంలో కొవ్వు పేరుకుపోతే అది రక్తంలో కొలస్ట్రాల్‌ స్థాయిని కూడా పెంచుతుంది. అయితే మనం లిపిడ్‌ ప్రొఫైల్‌ అనే రక్త పరీక్ష చేయించినప్పుడు ఆ పరీక్షలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్‌), చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) అనే వాటి గురించి వింటుంటాం. ఇటీవలి కాలంలో ఆహార పద్ధతులు, శారీరక వ్యాయామం గాడితప్పడంతో చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్‌ పెరిగిపోతోంది. దాని వల్లే రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడుతుంటాయి. అయితే హెచ్‌డీఎల్‌ పెంచుకుంటే అది గుండెకు రక్షణ కవచంగా నిలుస్తుందని డాక్టర్లు పేర్కొంటారు. హెచ్‌డీఎల్‌ ఎంత ఎక్కువగా ఉంటే శరీరానికి అంత మంచిది. దీని వల్ల గుండె నొప్పి రాకుండా ఉంటుంది.

నీలిరంగు, కూరగాయలు, పండ్లు ఉపయుక్తం

ఎల్‌డీఎల్‌ వల్ల గుండె జబ్బులే కాకుండా మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ కొలెస్ట్రాల్‌ అసమానతల వల్ల వచ్చే సమస్యను వైద్య పరిభాషలో డిస్‌లిపిడేమియా అని పిలుస్తారు. రక్తనాళాల్లో కొవ్వు పెరిగితే గుండెకు హానికరం అని తెలిసిందే. అందుకే చెడు కొలస్ట్రాల్‌ను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అదే సమయంలో మంచి కొవ్వును పెంచుకోవడం కూడా అంతే ప్రధానం. మంచి కొలెస్ట్రాల్‌ మరీ తక్కువగా ఉంటే రక్తనాళాల్లో పూడికలు తెచ్చే అథెరోస్ల్కీరోసిన్‌ వ్యాధి, గుండెపోటు రావచ్చని డాక్టర్లు చెబుతారు. అందుకే మంచి కొవ్వును పెంచుకునేందుకు ప్రయత్నించాలి. నీలిరంగులో ఉండే కూరగాయలు, పండ్లు తీసుకుంటే హెచ్‌డీఎల్‌ పెరిగే అవకాశం ఉంటుంది. వంకాయ, బ్లూబెర్రీ, బ్లాక్‌ బెర్రీస్‌తో మంచి కొలస్ట్రాల్‌ పెరుగుతుంది.

చెడు కొవ్వును కరిగించి.. మంచి కొవ్వును పెంచుకుని..


పీచు పదార్థాలు, నిత్య వ్యాయామం

చెడు కొవ్వును నియంత్రణంలో ఉంచి, మంచి కొవ్వును పెంచుకోవడానికి పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కాయగూరలు.. కాల్షియం ఎక్కువగా ఉండే పాలు, గుడ్లు, చేపలు, పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. నిత్యం వ్యాయామం చేయాలి. ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. ఒమేగా-3 కొవ్వులు.. ఓట్స్‌, గ్రీన్‌ టీ, ఆలివ్‌ నూనె, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, మొలకెత్తిన ధాన్యాలు ఇవన్నీ మన రక్తంలో మంచి కొవ్వును పెంచుతాయి. వీటిని మన ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid