Flaxseeds Benefits



        PC: TV9 telugu
       అవిసె గింజ‌ల రుచిలో పెద్ద ప్ర‌త్యేక‌త ఏమీ లేక‌పోయినా ఈ గింజ‌ల‌ను మాత్రం సూప‌ర్‌ఫుడ్ అని అంటారు ఆరోగ్య నిపుణులు. వీటిల్లో విటమిన్లు , ప్రోటీన్ , ఆమ్లాలు వంటి పోషకాలు అనేకం ఉన్నాయి. 
            అవిసె గింజలు ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయగల వని ప్రముఖ డైటీషియన్ తమర్ శ్యామ్యూల్ చెప్పారు. ఇక “ఎక్కడైతే ప్రజలు అవిసె గింజలను తమ రోజు వారి ఆహారంలో భాగం చేసుకుంటారో, అక్కడ చక్కటి ఆరోగ్యం వెల్లివిరుస్తుందని” మహాత్మాగాంధీ ఏనాడో అన్నారు. నిజమే.. ఈ చిరు గింజలలో పలు ప్రయోజనాలున్నాయి. వంటకాల్లో ఉపయోగించడానికి సులభమైనవి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, అవిసె అత్యంత శక్తివంతమైనది. 

1. అవిసె గింజల్లో మేలురకం కొవ్వులు, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లా‌లు అధికం. చేపలలో ఉండే ఆరోగ్యకరమైన ఒమేగా -3 అవిసె గింజల్లో ఉంటాయని డైటీషియన్ జెన్నిఫర్ మిమ్ఖా చెప్పారు.

2 ఈ గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది.

3. అవిసె గింజలలో ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు ఉంటాయని శ్యామ్యూల్ చెప్పారు. అందువల్ల తరచుగా వీటిని తీసుకోవడం వల్ల హృదయ స్పందన సమతుల్యం అవుతుందని అన్నారు. అవిసె గింజల్లోని లిగ్నన్స్ కూడా గుండె ఆరోగ్యానికి ఉపయోగకరమని తెలిపారు.

4. అవిసె గింజలలో గల ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ ల నిరోధానికి దోహదం చేస్తాయి. వేయించి పొడిచేసి అవిసె గింజల పొడిని అన్ని ఆహార పదార్ధాలలోనూ కలపవచ్చని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

5 అవిసె గింజలు రక్తంలోని షుగర్ లెవెల్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది. 20 శాతం వరకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని శామ్యూల్స్ చెప్పారు. ఈ గింజలలోని ముసిలేజ్ జీర్ణక్రియను నెమ్మదిపరచి రక్తంలో గ్లూకోజ్ కలవడాన్ని నియంత్రిస్తుంది. అవిసె గింజల్లో ఫ్లాక్స్ సీడ్లో ఫైబర్ అధికంగా ఉండటంతో తరచు తీసుకుంటే మధుమేహం బారిన త్వరగా పడరని చెప్పారు.

6. అవిసె గింజలో అధిక మొత్తంలో ఉన్న ఫైబర్ మీ జీర్ణవ్యవస్థను వృద్ధి చేస్తుంది. అతిసారం , మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది

7. అవిసె గింజలు చర్మం గ్రంథులు ఉత్పత్తి చేసే ఒక జిడ్డు పదార్ధం సిబం ఉత్పత్తిని నియంత్రిస్తాయి. తద్వారా మొటిమలు రాకుండా అరికడతాయి. ఇక వీటిల్లో ఉండే ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చర్మ ఆరోగ్య మరియు సౌందర్యానికి బాగా దోహదం చేస్తాయి. అవి చర్మాన్ని తేమగా మరియు మృదువుగా చేస్తాయి. ఈ గింజలను తినడం వల్ల అందమైన ఒత్తైన జట్టు సొంతం చేసుకోవచ్చు.. గోర్లు బలంగా పెరుగుతాయి.

8. అవిసె గింజలు హార్మోన్లను నియంత్రించగలదు. రుతు చక్రం మీద ప్రభావం చూపుతుంది. వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది. దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది.

అయితే ఈ అవిసె గింజలు తింటే కొంతమందికి దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా షుగర్ పేషేంట్స్ , గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు వీటిని తీసుకోక పోవడం మంచిది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid