మునగాకుతో లాభాలు
తక్కిన ఆకుకూరలతో పోలిస్తే మునగాకుని తక్కువగా తింటాం. కానీ దాని ప్రయోజనాలు తెలిస్తే మాత్రం మీరిక వదలకుండా తింటారు.
పాలకూరతో పోలిస్తే ఇరవైఐదు రెట్లు ఎక్కువగా ఇందులో ఇనుము ఉంటుంది. క్యారెట్లతో పోలిస్తే పదిరెట్లు ఎక్కువగా విటమిన్ ఎ అందుతుంది.
పాలల్లో కంటే మునగాకులో ఉండే క్యాల్షియం పదిహేడు రెట్లు అధికం. పిల్లలు తినే ఆహారంలో దీన్ని చేరిస్తే వాళ్ల కు ఎముక బలం పెరుగుతుంది.
గొంతునొప్పి, దగ్గు, గొంతులో ఏదో అడ్డుపడ్డట్లు అనిపించడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక కప్పు వేడి మునగ సూప్ తాగి చూడండి. ఈ సమస్యలన్నీ పోతాయి. శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడేవారు మునగాకుని తరచూ తీసుకుంటే మంచిది. ఇది శరీరంలోని వ్యర్థాలను తేలిగ్గా బయటకు పంపుతుంది.
(ఈనాడు)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి