పిస్తా



పిస్తా పప్పు ప్రయోజనాలు, ఉపయోగాలు ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నింటిని చూద్దాం:
ఒక చిరుతిండిగా, తాజాగా లేదా వేయించి లేదా ఉప్పు చల్లి, సలాడ్ పైన వేసుకుని, డ్రై ఫ్రూట్స్ తో కలిపి, కేకులు లేదా చేప లేదా మాంసం వంటి వాటితో కలిపి పిస్తాపప్పులను తినవచ్చు. వీటితో పాటు పిస్తాపప్పులను పిస్తాపప్పు ఐస్క్రీం, కుల్ఫి, పిస్తా బటర్, హల్వా మరియు చాక్లెట్ల తయారీలో కూడా ఉపయోగిస్తారు.
పిస్తాపప్పులు ఆహారంలో చేర్చగల ఆరోగ్యకరమైన గింజల్లో ఒక రకం. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, శక్తి పుష్కలంగా ఉంటుంది, ఆరోగ్యకరమైన కొవ్వులు మంచి మొత్తాలలో ఉంటాయి ఇవన్నీ ఆరోగ్యాన్ని కాపాడటం మరియు యవ్వనంగా ఉంచడంలో సమర్థవంతమైనవి. పిస్తాపప్పుల యొక్క ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నింటిని చూద్దాం.
కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది: 
తక్కువగా క్రొవ్వు పదార్ధాలు ఉండే గింజల్లో పిస్తాపప్పులు ఒకటి మరియు రూపంలో ఈ కొవ్వులు ఎక్కువగా అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు. పిస్తాపప్పుల వినియోగం చెడ్డ కొలెస్ట్రాల్ ను తగ్గించి మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుందని, ఇది గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది: 
ఆకుపచ్చ మరియు ఊదా రంగు పిస్తాపప్పులు లౌటిన్ మరియు ఆంథోసయానిన్ వంటి పిగ్మెంట్లను కలిగి ఉంటాయి, ఇది జ్ఞానాన్ని(ఆలోచన మరియు అవగాహన) మెరుగుపరచడంలో సమర్థవంతముగా పనిచేస్తాయి.
బరువు కోల్పోవడానికి సహాయపడుతుంది: 
పిస్తాపప్పులు మరియు గింజలు సాధారణంగా సాధారణంగా బరువుని పెంచేవిగా భావిస్తారు.అయితే, వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు తగినంత డైటరీ ఫైబర్ ఉంటాయి ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగించి బరువు తగ్గడానికి సహాయపడతాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid