అరిగిన_కీళ్లకు_వైద్యం_చేయడం_సాధ్యం_మేనా?
కీళ్ల_అరుగుదలతో_వచ్చే_ఈ_నొప్పుల_గురించి_ఎన్నో_అపోహలున్నాయి_ఆ_అపోహల_గురించి_అసలు_వాస్తవాల_గురించి అవగాహనా_కోసం_నవీన్_నడిమింటి_సలహాలు_ఈ_ప్రత్యేక_కథనంలో_తెలుసుకుందాం.*
వయసు రోజురోజుకూ పెరుగుతున్నట్లు... అరుగుదల కూడా ముందుకే కొనసాగుతుంది. అలా అరిగే ప్రక్రియను ఏవిధంగానూ వెనక్కు మళ్లించలేం. ఇదీ వన్–వే ట్రాఫిక్‌లో ప్రయాణించడం లాంటిది. ఆ దారిలో వెనక్కు తిరగడం సాధ్యం కాదు. కాకపోతే ప్రయాణాన్ని నెమ్మదిగా సాగేలా చేసుకోగలం. కీళ్ల అరుగుదల విషయంలోనూ అంతే. అందమైన మన మునుపటి ఫిట్‌నెస్‌ను కొనసాగించేందుకు వ్యాయామాల వంటి మంచి జీవనశైలి అలవాట్లతో, మరికొన్ని జాగ్రత్తలతో వాటి అరుగుదల ఆలస్యంగా జరిగేలా మాత్రం చూసుకోగలం.
*ఆ_తరంలో_ఆ_బాధలు_లేవెందుకు...*
అప్పటి తరంలో చాలామందికి వృద్ధాప్యం వచ్చిన చాలా ఏళ్లకు గానీ కీళ్లనొప్పులు వచ్చేవి కావు. అయితే ఇటీవల చాలామందికి నలభై ఏళ్లు దాటకుండానే కీళ్లనొప్పులు వస్తున్నాయెందుకు అని కొందరు అడుగుతుంటారు. ఇందుకు నాలుగు అంశాలను ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అవి
1. కండరాల బలహీనత;
2. ఊబకాయం;
3. శారీరక శ్రమ;
4. సైనోవియల్ ఫ్లూయిడ్ వల్ల కార్టిలేజ్ బలోపేతం అయ్యే ప్రక్రియలో అవరోధం ఏర్పడటం. ఈ నాలుగు అంశాల్లోనూ ప్రధానమైనది శారీరక శ్రమ.వివరాలు కు ఈ లింక్స్ లో చూడాలి
https://www.facebook.com/1536735689924644/posts/2784394495158751/
*ఎంతగా_నడిస్తే_కీళ్లు_అంతగా_అరుగుతాయా?*
నడక వల్ల కీళ్లపై భారం పడి త్వరగా అరిగిపోతాయన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఎముకకు నేరుగా పోషకాలు అందవు. మన వ్యాయామం, నడక వల్లనే ఎముకకు పోషకాలు అందుతాయి. అలాగే సైనోవియల్ ఫ్లుయిడ్ ఆరోగ్యానికీ నడక అవసరం. అందువల్ల ఎంత నడిస్తే కీళ్లకు అంత ప్రయోజనం. కానీ ఈ నడక ఎలా పడితే అలా ఉండకూడదు. ఏవి పడితే ఆ చెప్పులు తొడుక్కొని, ఇష్టం వచ్చిన ఉపరితలం మీద నడిస్తే ఆ నడక ప్రయోజనం ఇవ్వదు. మెత్తటి అడుగుభాగం (సోల్) ఉన్న షూతో మట్టినేల లేదా గడ్డితో మెత్తగా ఉన్న నేలమీద గానీ ఆ నడక వల్ల తగిన ప్రయోజనం చేకూరుతుంది. ఇక మోకాలిపైన బరువు పడేందుకు దోహదపడే మరో అంశం ఇండియన్ స్టైల్ టాయిలెట్ సీట్.
*కాల్షియమ్_తగ్గడం_వల్ల_కీళ్ల_నొప్పులు_వస్తాయా?*
మన ఆహారంలో కాల్షియమ్ తగ్గడం అన్నది కీళ్లనొప్పులకు దారితీస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. నిజానికి కాల్షియమ్‌కూ, కీళ్లకూ ఎలాంటి సంబంధం లేదు. కాల్షియమ్ లోపం వల్ల ఎముక బలహీనం కావచ్చుగానీ... కీళ్లతో కాల్షియమ్‌కు నేరుగా సంబంధం ఉండదు. కీళ్లపై కాల్షియమ్ ప్రత్యక్ష ప్రభావమూ ఉండదు.
నిజానికి కీళ్లనొప్పి అన్నది ఎముక బలహీనం కావడం కంటే, ఎముక చివరన ఉండే కార్టిలేజ్ అనే భాగం అరగడం వల్ల, అందులోని గ్లూకోజమైన్ అనే జీవరసాయనం తగ్గడం వల్ల వస్తుంది. ఈ కార్టిలేజ్‌నే వ్యావహారిక భాషలో కొందరు గుజ్జుగా వ్యవహరిస్తుంటారు. ఆ గుజ్జులోని నీటి పరిమాణం తగ్గడం వల్ల కూడా కీళ్లనొప్పులు వస్తుంటాయి. అంతేగానీ ఆహారానికీ, క్యాల్షియమ్‌కూ... కీళ్లనొప్పులకూ నేరుగా సంబంధం లేదు.
*అందుబాటులో_మందులు*
కీళ్లనొప్పుల తీవ్రతను 4 దశల్లో చెప్పవచ్చు. ఇందులో మొదటి రెండు దశల్లో నొప్పులను మందులతోనే తగ్గించవచ్చు. మూడో దశలో చాలా వరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అయితే నాలుగోదశలో ఉంటే మాత్రం అది శస్త్రచికిత్సతో మాత్రమే తగ్గుతుంది. ఇలా మొదటి రెండు దశల్లోని కీళ్లనొప్పులకు గతంలో వాడే నొప్పి నివారణ మందులతో పొట్టలో అల్సర్స్ రావడం, కడుపులో రక్తస్రావం కావడం వంటి దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) వచ్చేవి. కానీ ఇటీవల కాక్స్–2 ఇన్హిబిటర్స్ అనే కొత్తరకం మందులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి లేజర్ గన్స్‌లా పనిచేసి, కేవలం దెబ్బతిన్న భాగాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయి. అంతేతప్ప ఆరోగ్యకరమైన కణాలను ఎంతమాత్రమూ ముట్టుకోవు. అలాగే గ్లూకోజమైన్ వంటి కాండ్రోప్రొటెక్టివ్ మందులు కూడా నొప్పిని తగ్గిస్తాయి. అయితే అవి కీలులో తగ్గిన గుజ్జును మళ్లీ పుట్టించవు. కాకపోతే గుజ్జు తరిగిపోయే ఒరవడిని మాత్రమే తగ్గిస్తాయి.
*శస్త్రచికిత్సే_శరణ్యమా?*
మోకాలు మొదలుకొని అన్నిరకాల కీళ్లనొప్పులలోనూ 80% సందర్భాల్లో మందులు, ఫిజియోథెరపీ, వ్యాయామంతోనే చాలావరకు తగ్గుతాయి. కేవలం 20% కేసుల్లోనే శస్త్రచికిత్స అవసరం. ముందే చెప్పినట్లుగా కీళ్లనొప్పుల్లో ఉండే తీవ్రత... మూడు నాలుగు దశలకు చేరినప్పుడు మాత్రమే శస్త్రచికిత్స అవసరమని గుర్తించాలి. కాబట్టి ముందే డాక్టర్‌ను సంప్రదించి శస్త్రచికిత్స వరకు వెళ్లకుండా కాపాడుకునే జీవనశైలి జాగ్రత్తలు పాటించాలి.
#నవీన్_ఆయుర్వేదం_సలహాలు
ఉదయం సూర్యోదయంతరువాత ఏడు గంటలవరకు సూర్యరశ్మి లో గడపాలి .అలా D vitamin కావలసినంత లేకపోయినా triglisarides, bad cholestral కూడా బాగా పెరిగిపోతా యి .
*ఇక D విటమిన్ కావాల్సినంత పెంచుకున్నతరువాత క్యాలిషియంకూడా పెంచుకోవాలి .దానికోసం రోజు ఒక ఉసిరికాయతింటే చలామంచిది . దానిలోని C విటమిన్ కూడా D ని పెంచి క్యాలిష్యం పెరుగుదలకు దోహదపడుతుంది .ములగచెట్టు ఆకు లో సహజద్ధమైన క్యాలిష్యం విపరీతముగా వుంది .కా లీ ఫ్లవర్ లో కూడా క్యాలిష్యంవ వి పరీతముగా వున్నది*
.
కాలి ఫ్లవర్ +5 మిర్యాలుపొడి +HALFSPOON జీలకర్ర +2 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టి +కొద్దిగా SALT కల్పి సూప్ లా చేసుకొని కొద్దిరోజులు పరగడుపున త్రాగితే కీళ్ళ నెప్పులు ,మెడ నెప్పులు మోకాలి నెప్పులు తగ్గిపోతాయి .
*పలుచని మజ్జిగ 1గ్లాసుడు తీసుకొని దానిలో రెండు స్పూన్లు[ మీడియంస్పూన్ ] మెంతుల పిండి బాగా కలిసేలా తిప్పి ప్రతిరోజూ త్రాగితే కూడా మోకాలి నెప్పులు తగ్గిపోతాయి రోజు మొత్తంలో ఎప్పడైన త్రాగవచ్చు,ముఖ్యముగా మోకాలి నెప్పులు కి బాగా పని చేస్తుంది .షుగర్ వాళ్ళకి చాలా మంచిది .ఇక తరువాత```250గ్రాము లు మెంతులు ,100గ్రాములు వాము ,50 గ్రాముల నల్లజీలకర్ర ఈ మూడింటిని కలిపి కొద్దిగా వేయుంచి పొడి తయారు చేసుకోండి .రొజూ రాత్రి భోజనం తరువాత ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక spoon పొడి కల్పుకొని త్రాగవలెను[ ,వేడినీటితో మాత్రమె ]ఇది తీసుకున్న తరువాత ఎటువంటి ఆహారం తీసుకోరాదు ,కాని 3 నెలలు మాత్రం తప్పక వాడితేనే మంచి ఫలితం వస్తుంది .*
పారిజాతం ఆకులు ఓ 5 ఆకులు తీసుకొని కషాయం కాచి చల్లార్చి తాగితే కీళ్ళ నెప్పులు ,మోకాలి నెప్పులు తగ్గిపోతాయి .ఎక్కవ ఆకులు వేసుకోవద్దు వేడి చేస్తుంది. నేలవేము పొడి ఆయుర్వేదం షాప్ లలో దొరుకుతుంది దానిని తెచ్చి కొద్దిగా వ్యా ధి తీవ్రత బట్టి 1 లేదా 2 స్పూన్లువేసిఒక గ్లాసు నీరు పోసి కషాయంకాచి త్రాగితే[ కావాలంటే తాటికల్కండ లేదా తేనె వేసుకోవచ్చు ] కీళ్ళ నెప్పులు అన్నీతగ్గిపోతాయి .ముఖ్యముగా కీళ్ళ వాతం,కీళ్ళ జ్వరం ,చికెన్ గున్యా వచ్చిన వాళ్ళకి ఈ మందు అద్బుతము గా పని చేస్తుంది .
*1/4 spoon పసుపు + 1 spoon జీలకర్ర , 1/2 spoon తాటికల్కండ ఓ గ్లాస్ నీరు పోసి కషాయంకాచుకోవాలి బాగా ఇగిరిన తరువాత దానిని .రెండుపూటలా 50 mlనుంచి 100ml వరకు త్రాగుతువుంటే కీళ్ళల్లోవాపు ఎరుపు రంగు stiffness ,నొప్పి తగ్గిపోతాయి .ముఖ్యముగా ఇది artharities, మైగ్రే న్ వాళ్ళకు ఎక్కువ ఈ రకం నొప్పులు వస్తూవుంటా యి* .
వెలక్కాయ లేదా వెలగపండు ఏదోవిధముగా లోపలికి తీసుకొంటే అంటే పండులో షుగర్ వేసుకొని తిన్టమో లేక వెలగ క్కాయని పచ్చడి గా చేసుకొని తిన్టమో చేస్తుంటే మనిషికి కావాల్సినంత క్యాలీషియం వచ్చి పడుతుంది. మోనోపాజ్, మెనోపాజ్ వాళ్ళకు క్యాలిష్యంలోటు తీరితే చాలా సమస్యలు కీళ్ళకు సంబందించి పోతాయి .దానికోసం కొద్దిగా బార్లీ గింజలు తీసుకొని కొద్దిగా salt వేసి ఉడికించి పెట్టుకోవాలి . దానిలో కొంచం కాచిన పాలు పోసి లోపలికి తీసుకొంటే రోజు అలా కొద్ది రోజులు చేస్తే కావలసినంత కాల్షియం వచ్చి పడుతుంది.
*మోకాలు నొప్పితో బాధపడేవారు ప్రతిరోజూ ఓ కప్ లో అటుకులు వేసుకొని కొద్దిసేపు నానపెట్టుకొనితింటూ వుంటే ఆ రోజూ కి కావాల్సిన క్యాల్షియం మనిషికి వచ్చేస్తుంది .పోహా[అటుకులు ]నానబెట్టుకొని ఉప్మాచేసుకొని తింటూ వుంటే కూడా క్యాలిష్యంకావసినంత వచ్చి ఎముకల నెప్పులు,సమస్యలు తగ్గిపోతాయి . బెండకాయలోను,తోటకూరలోను ,క్యాప్సికంలోను రాగుల పిండి లో కూడా క్యాలిష్యం ,ఐరన్ పిచ్చిపిచ్చిగావుంటుంది* .
ఇక పైన వన్ని మేము చేసుకోలేము అంటే ఆయుర్వేదం షాప్ లలో దూత్ తాపెస్వర్ కంపెనీ లో అస్తిపోష్ క్ డబ్బా /110 rsవుంటుంది అది తెచ్చుకొని వాడుకోవచ్చు .అది వాడితే నేరేడు,కాకర కాయలు తినకూడదు .కాని కొద్దిరోజుల్లోనే కీళ్ళ నెప్పులు ,మోకాలి నెప్పులు తగ్గిపొతాయి .ఇంగ్లీష్ మందుల్లా రాళ్ళు వస్తాయి అనే భయం వుండదు.
*పైన చెప్పిన వన్నిచేయాలనిలేదు .మనకు వీలుగా వున్నవి ఒకటి ,రెండు చేసుకొని బైట పడవచ్చు .ఎదిఎమైన ఇంగ్లీష్ మందుల్లగా వెంటనే పని చేయవు ,ఆయుర్వేదం ,సిద్దవైద్యం కొంత టైం తీసుకుంటా యి .కానీ సంపూర్ణమైన ,శాస్వతమైన ఫలితాలను ఇస్తుంది .ఇంగ్లీష్ మండుల్లా sideeffects వుండవు .కాని మనం పైన చెప్పుకున్న ఆయుర్వేదం లేదా గృహ వైద్యం కొద్దిరోజులు అ యి నా వాడితే మంచి ఫలితాలు ఇస్తుంది* .
నిలబడి నీరు త్రాగకండి.కూర్చుని త్రాగండి .కూర్చుని భోజనం చేయటం ఎంతో మంచిది .నిలోచోనిమూత్రం పోయకండి క్రింద కూర్చుని పోసుకోవటం చాలా మంచిది.
*ఇంగ్లీష్ మందుల్లో ని painkillars ని ఎక్కువగా వాడటం మంచిది కాదు .అయితే ఇంగ్లీష్ మందుల్లో ultracet సేఫ్ డ్రగ్ అంటున్నారు అది కూడా ఎక్కువ వాడకూడదు , ఆయుర్వేదంలో painkillars గా sallaki టాబ్లెట్స్400mg వాడవచ్చుదీనిలో ఇంకాస్త పవర్ ,strong,forte, అని వుంటుంది కొంచం* costవుంటుంది. అది కూడా మంచిదే
చింతగింజలపొడి [coffepodi షాప్ లో దొరుకుతుంది ] కొంత తీసుకొని దానికి సమానముగా తుమ్మబంక [ఆయుర్వేదం షాప్ లో దొరుకుతుంది ] ఈ రెండు మిక్స్ చేసి లోపలికి ప్రతి రోజు కొంత తీసుకోవాలి దానివల్ల మోకాలి చిప్పలలో అరిగి పోయున చోట గుజ్జు వచ్చి మోకాలి నొప్పులు తగ్గిపోతాయి .అలానే మొకాలిచిప్పలపై కలబంద గుజ్జు గుండ్రముగా పట్టిచ్చండి కొన్నిఘంటలువుంచి రుద్దండి.కదిగేసుకోండి ‘లేదా నువ్వులనూనె లో చింత గింజల పొడి కల్పి రాత్రి పడుకోనేటప్పుడుమొకాలిచిప్పలు పై పట్టించి గుండ్రముగా వ్రాసి పైన గుడ్డ కట్టు కొండి రాత్రంతా వుంచి తెల్లవారి కడిగేసు కోండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి