కొవిడ్ బాధితుల చికిత్సలో విటమిన్లకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. విటమిన్ సి, డి, జింకు మాత్రలను కచ్చితంగా వాడాల్సిందిగా వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇంత ముఖ్యమైన విటమిన్లను అవసరాల మేరకు మాత్రల రూపంలో తీసుకుంటూనే.. అందుబాటులో ఉండే పండ్లు, కూరగాయల నుంచి స్వీకరించడం ద్వారానూ పొందవచ్చు. రోజూ వీటిని తీసుకోవడం ద్వారా కరోనా సోకని వారికి వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెంపొందుతుందని చెబుతున్నారు. వంటింట్లో నిత్యం వినియోగించే పోపులపెట్టె కూడా చిన్నపాటి ఔషధశాలగా ఉపయోగపడుతుందంటున్నారు. క్రమం తప్పకుండా తగుమోతాదులో స్వీకరిస్తే మేలు జరుగుతుందంటున్నారు. విటమిన్ ఎ యాంటీ జెన్, యాంటీబాడీస్ పనిచేయడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. నోరు, జీర్ణాశయం, పేగులు, శ్వాసకోశ వ్యవస్థలోని కణజాలాన్ని రక్షిస్తుంది. * చిలగడదుంప(స్వీట్ పొటాటో), క్యారెట్, బీట్‌రూట్, కీరదోస, మామిడి, బొప్పాయి, ఆప్రికాట్స్, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తుల్లో అధికంగా లభిస్తుంది. విటమిన్ ఇ కణం ఆకృతి చక్కగా రూపాంతరం చెందాలంటే చాలా ముఖ్యం. యాంటాక్సిడెంట్లుగా ఉపయోగపడుతు...