ముల్లంగి
వగరుగా కొద్దిగా కారంగా ఉండే ముల్లంగి అంటే తెలియనివారు ఎవరుంటారు? ఇందులో పిండి పదార్థాలు పెద్దగా ఉండవు. కొవ్వుశాతం తక్కువ. మేలు చేసే పీచుపదార్థాలు, తేమ మాత్రం పుష్కలం. ఘాటైన నూనెలున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సాయపడతాయి. పచ్చిగానే స్వీకరించడం మంచిది. కాయగూర లలో ఏడాది పొడవునా వచ్చేది ముల్లంగి.
ముల్లంగి కూర ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. ముల్లంగి దుంపను చక్కగా ముక్కలు చేసుకొని అందులో నిమ్మరసం,
మిరియాల పొడి మరియు ఉప్పు కలిపి రోజుకు 3 సార్లు తింటే మొలలు, మలబద్ధకం, అజీర్తి, శూల, ప్లీహం,కాలేయం సంబంధించిన వ్యాధుల్లో, కామెర్ల కు ఇది బాగా పనిచేస్తుంది.భోజనం తర్వాత ముల్లంగి, మిరియాల పొడి కలిపి తినడం వలన ఆహారం చక్కగా జీర్ణమౌతుంది.
ముల్లంగి రసం, తేనె,సైంధవలవణం కలిపి రోజుకు 3సార్లు తీసుకుంటే బ్రాంకైటీస్ తగ్గుతుంది.
ముల్లంగిని -ఇతర తాజా కూరగాయలతో కలిపి సలాడ్ గా తీసుకుంటే పైల్స్, అజీర్ణం, మలబద్ధకం వంటివిరావు.ఓ చెంచా ముల్లంగి రసంలో చెంచా తేనె, చిటికెడు ఉప్పు, వేసుకుని తాగితే జలుబు, దగ్గు తగ్గుతాయి.
అధిక బరువు, చక్కెర వ్యాధి ఉన్నవారు, ముల్లంగి కూరతింటే కడుపు నిండిపోతుంది. ఆకలిని తగ్గిస్తుంది.
తాజా ముల్లంగి దుంపలు మూలశంకతో బాధపడే వారికి మేలు చేస్తుంది. ఉడకబెట్టిన ముల్లంగి మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపు ఉబ్బరానికి కూడా ముల్లంగి రసాన్ని పంచదారతో కలిపి ఇవ్వవచ్చు. అనేక అజీర్ణరోగాలకు ముల్లంగి ఆకులు ఎంతో మేలు చేస్తాయి. తాజా ముల్లంగి రసం ఆకలిని పుట్టిస్తుంది. ముల్లంగి దుంప ముక్కలను రోజూ ఉదయం, సాయంత్రం కొంచెం తింటుంటే... శరీరం మీద తెల్లమచ్చలు రాకుండా చర్మం తేజోవంతమవుతుంది. కంటి చూపును వృద్ధి చేస్తుంది. నరాల బలహీనతలను పోగొట్టి శరీరానికి బలాన్ని కలిగిస్తుంది.
పిల్లల్లో కోరింత దగ్గుకు మంచి ఔషధంగా పని చేస్తుంది. పంటి చిగుళ్లను గట్టిపరుస్తుంది. చెముడును పొగొట్టి వినికిడి శక్తిని వృద్ధి చేస్తుంది.
లేత ముల్లంగి అయితేనే త్వరగా అరిగేది. ఖాళీ కడుపుతో ముల్లంగి తినకూడదు.ముల్లంగిని జ్యూస్ చేసుకుని రోజూ తాగుతుంటే లివర్ వ్యాధులు దరిచేరవు.
ముల్లంగి ఆకుల్లో పొటాషియం, విటమిన్ ఎ.సి లు అధికశాతంలో ఉంటాయి. ముల్లంగి ఆకులరసం 100 మి.లీ రోజుకుఒక్కసారి తాగితే మూత్రం సాఫీగా వస్తుంది. మూత్రాశయం లోని రాళ్లను కరిగిస్తుంది. అధికరక్తపోటు రోగులకు, శరీరము అంతా వాపు వచ్చిఇబ్బందిపడు రోగులకు, (నెఫ్రైటీస్ రోగులకు) ,మొలల రోగులకు మంచిది.
ఎ. సి విటమిన్లు, పొటాషియం, ఇనుము లాంటి ఖనిజాలు అధికంగా ఉండే ముల్లంగి ఆకులతో కషాయం కాచి చిటికెడు నిమ్మరసం కలిపి పుచ్చుకుంటే మూత్రాశయ సంబంధిత మంట తగ్గుతుంది. పచ్చకామెర్లు ఉన్నవారు ఇతర ఆకుకూరలతో కలిపి దీనిని వండి తీసుకుంటే ఫలితం ఉంటుంది.
ముల్లంగి ఆకులతో కషాయం కాచి చిటికెడు నిమ్మరసం కలిపి తీసుకుంటే మూత్రాశయ సంబంద మంట తగ్గుతుంది.
రోజూ ముల్లంగి ఆకులతో కూర వండుకుని అన్నంలో కలుపుకుని తింటుంటే మూత్రపిండాలలో ఏర్పడిన రాళ్లు కరిగిపోతాయి. పచ్చి ముల్లంగి దుంపలు, ఆకుల రసాన్ని తాగుతుంటే లివర్ వ్యాధులు తగ్గిపోతాయి. జీర్ణశక్తి కూడా వృద్ధి చెందుతుంది.
ముల్లంగి గింజలను ఆవుపాలలో మరిగించి తాగితే నపుంసకత్వం పోతుంది. లైంగిక శక్తి పెరుగుతుంది. శీఘ్రస్కలనంనిరోధించబడుతుంది.
ముల్లంగి గింజలను మెత్తగా నూరి
ముఖానికి పట్టించి 1 గంట తర్వాత కడిగిన ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది. ముఖం మీద నల్లటి చారలు పోతాయి.మొటిమలు నివారించబడతాయి. ముల్లంగి గింజలను పొడిచేసి, నీళ్లలో చిటికెడు కలిపి రాత్రిపూట తాగితే కడుపులోని పురుగులు చనిపోతాయి.
ముల్లంగి విత్తనాలను బాగా ఎండబెట్టి, మెత్తగా దంచి, ఆ పొడిని కొంచెం అన్నంలో కలుపుకుని తింటే స్త్రీలలో రుతుస్రావదోషాలు పోతాయి. వీటితోపాటు జలుబు, దగ్గు, ఆయాసం మొదలైనవి కూడా తగ్గుతాయి.రోజూ ముల్లంగి దుంపలను తీసుకుంటే శరీరంపై తెల్లమచ్చలు పోతాయి. ముల్లంగి గింజలను పొడిచేసి నీళ్లలో చిటికెడు కలిపి రాత్రిపూట సేవిస్తే కడుపులో నులిపురుగులు నివారించబడతాయి.
ముల్లంగిని కూరలతో కలిపి సలాడ్ గా తీసుకుంటే అజీర్ణం,మలబద్ధకం వంటివిరావు. పైల్స్ ఉంటే తగ్గిపోతాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి