క్యారెట్




         భారతదేశమంతటా పండించే పంట క్యారెట్. క్యారెట్ చూడడానికిఎంతో అందంగా ఉంటుంది. పోషకవిలువలు కూడ తక్కువేమీ కాదు.క్యారెట్ ఆకులను మనం ఉపయోగించక పోవడం చాలా దురదృష్టకరం.క్యారెట్లలో ఆంథోసైనిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రగా ఉంటాయి.కెరోటిన్ ఎక్కువగా ఉంటే కాషాయరంగులో ఉంటాయి. 
       కేరట్, బీట్రూట్, కంద, ముల్లంగి, చిలకడ దుంపల వంటివి కాయలు కాదు. దుంపలు అనుకుంటాం కాని నిజానికి ఇవి ప్రత్యేక విధులను నిర్వర్తించడం కోసం  ఈ విధంగా రూపాంతరం చెందుతాయి.
       జీవనపోరాటంలో గెలిచేందుకు, జీవనం సాగించేందుకు అవసరమైన కాంతి, ఆహారం, గాలి పొందడానికి వేళ్లు రూపాంతరం చెందుతాయి. ఇలా జరగడం వల్ల బురద నేలలు,ఎడారులు, ప్రతికూల ఆవాసాల్లోకి సైతం మొక్కలు విస్తరించ గలిగాయి.అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకున్నాయి. ప్రత్యేకవిధుల నిర్వహణ కోసం మొక్కల అంగాల్లో నిర్మాణాత్మకమైన శాశ్వత మార్పులు ఏర్పడతాయి.ఈ మొక్కలు ఎదిగేందుకు మొదటి ఏడాది ఆహారపదార్థా లను ఎక్కువగా తయారుచేసి దుంపవేళ్లలో నిల్వ చేసుకుంటాయి. రెండో ఏడాది నిల్వచేసిన ఆహారాన్ని పుష్పాలు, ఫలాలు, విత్తనాల ఉత్పత్తికి వినియోగించుకుంటాయి. పోషకపదార్థాలు నిల్వ చేయడం వల్ల ఈ
మొక్కల్లో తల్లివేళ్లు రూపాంతరం చెంది నిలవ వేళ్లు ఏర్పడతాయి. ఆకృతులను బట్టి ఇవి మూడు రకాలు. ఇవి నూలు కండె ఆకారంలో
 (ముల్లంగి), శంఖాకారం (కేరట్), మూపురా కారం  (బీట్ రూట్) లో ఉంటాయి. వీటిలో ఆ మొక్కలు ఎదిగేందుకు అవసరమైన శక్తి నిల్వ ఉంటుంది. మానవ శరీర నిర్మాణానికి అవసరమైన పోషకాలు వీటిల్లో ఉండటంతో వీటిని ఆహారంగా తీసుకోవాలి.

          క్యారెట్ దుంపలోనే కాక ఆకుల్లో కూడా ఎన్నో పోషక విలువలున్నాయి. క్యారెట్ ఆకుల్ని పారవేయకుండా  చెట్నీలాగ, కూరలాగ, పులుసులాగ  వాడితేమేలు.
       ‌క్యారెట్ లో విటమిన్-ఎతో పాటు ప్రొటీన్లు, లవణాలు, విటమిన్లు ఎక్కువగా ఉన్న పోషకాహారం. వీటి వేర్లు దుంపలుగా మారతాయి. క్యారెట్ లో ఉన్న కెరటిన్ విటమిన్-ఎగా రూపాంతరం చెందుతుంది.
విటమిన్-ఎ లోపిస్తే కంటి చూపు మందగించడం, రేచీకటి,నేత్ర సంబంధ వ్యాధులు, అంటువ్యాధులు, చర్మవ్యాధులు, దీర్ఘకాల విరేచనాలు, గొంతువాపు, నొప్పి, దగ్గు, వ్యాధి నిరోధకశక్తి తగ్గడం,ఎముకలు పెరగకుండటం వంటివి సంభవిస్తాయి. వీటన్నిటినీ నిరోధించగల శక్తి విటమిన్-ఎకు ఉంది. ప్రకృతి సిద్ధమయిన క్యారెట్ ను నియమబద్ధంగా తింటే విటమిన్ 'ఎ' లభించి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
విటమిన్ల లోపానికి క్యారెట్ జ్యూస్ త్రాగటం వలన విటమిన్ల లోపం తొలగుతుంది.
        క్యారెట్ ఆకుల రసం, కొద్దిగా నిమ్మరసం, చిటికెడు ఉప్పు కలిపి త్రాగిన విటమిన్ లోపం తగ్గుతుంది. గుండెకు, ఊపిరితిత్తులకు,
లివరకు బలాన్ని ఇస్తుంది. మలబద్ధకం, మూత్రం సాఫీగా రావటానికి పచ్చి క్యారెట్ తినడం వలన విరేచనం మరియు మూత్రం సాఫీగా అవుతుంది.
      క్యారెట్ ఆకుల రసం త్రాగటం వలన కాళ్ళు చేతుల మంటలు తగ్గుతాయి. క్యారెట్ కఫం తగ్గిస్తుంది. క్యారెట్ హల్వా చాలా రుచిగా
ఉంటుంది. 
       అజీర్తి, లివర్ కు సంబంధించినవ్యాధులు, రక్తహీనతకు అమోఘంగా పనిచేస్తుంది క్యారెట్. అంతేగాక పిల్లల ఎదుగుదలకు
సహకరిస్తుంది. హృద్రోగము, మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు,ఖనిజలవణాలు పుష్కలంగా లభించే క్యారెట్ ను ప్రతిరోజు తినడం వలన చక్కని ఆరోగ్యం లభిస్తుంది. 
       కళ్ళవ్యాధులకు, చర్మరోగాలకు కూడా క్యారెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

       
 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid