అరటిపండు
అరటి దక్షిణాసియా ఉష్ణమండల ప్రదేశాలకు చెందిన పండు. క్రీ.పూ.327లో అలెగ్జాండర్ సైన్యం భారతదేశంలో అరటిని పండించడం చూశాడు. అరటిని లాటిన్ లో వివేకవంతుల ఫలం అంటారు.క్రీ.పూ. 600 ల నాటి గ్రంథాల్లో కూడా అరటి గురించి ఉంది.
పోర్చుగీసువారు మొదట గినియా లో దీనిని చూశారు.1482లో కానరీ ద్వీపాలకు ఈ అరటి మొక్కను తీసుకు వెళ్ళారు. అక్కడి నుంచి ఇది అమెరికాలోకి ప్రవేశించింది.
1890కి ముందు అరటి పళ్ళ గురించి బ్రిటనువారికి అసలు తెలియదు. అప్పుడప్పుడు సముద్ర ప్రయాణాలు చేసే కెప్టెనులు వీటిని ఉష్ణమండలపు అపురూపమైన ఫలమని తెస్తూండేవారు.
అరటి పళ్ళలో దాదాపు 500 రకాలు న్నాయి. రోజుకొకరకం అరటిపండ్లను తినడం మొదలు పెడితే అన్ని రకాలు పూర్తయ్యేసరికి ఏడాదిన్నర పడుతుంది.
ఉష్ణమండల ప్రదేశాల నుంచి ఇతర దేశాలకూ అరటి పళ్ళు బ్రహ్మాండంగా ఎగుమతి కావటం 20వ శతాబ్దంలో ప్రారంభమైంది. అరటి పళ్ళను ఎక్కువగా పండించే దేశాలలో మనదేశం మొదటిది. మనదేశంలో ఏటా 10 లక్షల టన్నుల అరటి పళ్ళు ఉత్పత్తి
అవుతున్నాయి.ప్రపంచంలోని 12 దేశాలు, ఇతర ప్రదేశాల్లో కలిపి ఏటా 20 కోట్ల టన్నులు అరటిని పండిస్తున్నారు.
అరటిలో శక్తిని కలిగించే కార్బోహైడ్రేటులు అధికంగా ఉన్నాయి.ఇవి జీర్ణకోశానికి అపకారం చేయవు. తక్కువ ఖర్చుతో అధిక ఆహారపు విలువనిస్తుంది.అరటిపండులో విటమిన్ 'ఎ', విటమిన్ బి1 (థయామిన్) విటమిను సి (ఎస్కార్బిక్ ఆసిడ్) విటమిను బి2(రిబోఫ్లావిన్) అనేక ఖనిజాలు శరీరానికి మంచి పుష్టిని కలిగిస్తాయి. దీనిలో కార్బోహైడ్రేటులు ఉండటం వల్ల ఇవి ఇచ్చే
శక్తి అమూల్యమైంది. అధికంగా బాగా మగ్గిన అరటిపండు తింటే దీంట్లో లభించే డెక్స్ ట్రోజు, లెవ్ రోజు, సుక్రోజు వంటిపంచదారలను శరీరం వెంటనే గ్రహించుకుంటుంది. మిగిలిన పదార్థాలు శరీరంలో పూర్తిగా చేరడానికి కొన్ని గంటల కాలం పడుతుంది. ఇతర పళ్ళమాదిరి అరటి పండ్లు క్షారవంతమైనవి.
కాబట్టి ఇవి శరరీంలో ఆమ్లతను నియంత్రి స్తాయి. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే బాగా మగ్గిన అరటి పండు తినాలి.
మనసులో కలిగే సుఖదుఃఖాలు పెరొటోనిక్ అనే పదార్ధం లోపిస్తే ఏర్పడతాయి. అటువంటి పెరొటోనిక్ కావలసినంత ఉత్పత్తి అయ్యేందుకు అరటి దోహదం చేస్తుంది.అందువల్ల దీనిని తీసుకుంటే హుషారు కలుగుతుంది.
రోజూ అరటిపండు తింటే మంచిది. ఇందులో విటమిన్ సి ఉంది.దీని వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. విటమిన్ ఎ,బి6లతో పాటు కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం,పీచు పదార్థాలు ఉన్నాయి.
పొటాషియం దేహంలో ద్రవాల సమతుల్యతను కాపాడుతుంది. రక్తపోటు, గుండెజబ్బులు కూడా దూరమవుతాయని పరిశోధనలు తెలుతున్నాయి. పొటాషియం రక్తపోటును, అధిక వత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తొలగిస్తుంది.
అరటిలో ఫ్యాట్ అసలు ఉండదు. అలాగే కొలెస్ట్రాల్, సోడియం కూడా వుండవు. వ్యాయామం చేసే వాళ్ళూ తప్పనిసరిగా దీనిని తీసుకుంటారు. వ్యాయామం వల్ల ఖర్చయ్యే కార్బో హైడ్రేట్లు గ్లైకోజెన్, శరీర ద్రవాలను అరటి పళ్ళు భర్తీ చేస్తాయి.ఒక అరటి పండు 90 కేలరీల శక్తినిస్తుంది.
అరటి పండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలోకి ప్రవేశించగానే సెరటోనిన్ గా మారి ఒత్తిడిని తుంది. ఇందువల్ల మెదడు ఉత్తేజం పొంది ఆహ్లాదాన్నిస్తుంది.
జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటి దివ్యౌషధం. పచ్చని అరటి పండ్లు విరేచనా లను అరికడతాయి. బాగా పండిన పండ్లు మలబద్ధకాన్ని నివారిస్తాయి. పైల్స్ వ్యాధితో బాధపడే వారికి ఉపశమనాన్నిస్తుంది.
అరటిపండ్లలో కణోత్పత్తినిప్రోత్సహించే గుణం ఉంది. జీర్ణాశయ గోడలకున్న సన్నటి పొరను నాశనం కాకుండా రక్షిస్తుంది. పొటాషియం, ఫాస్పరస్, అయోడిన్,సల్ఫర్, కాల్షియం, మెగ్నీషియం, ఇనుము వంటి ఖనిజ లవణాలున్నాయి.
రక్తహీనత ఉన్నవారు ప్రతిరోజూ ఒక పండు తింటే రక్తం వృద్ధి అవుతుంది. దంతాల పటిష్టతకు అరటి బాగాఉపయోగపడుతుంది. తెలుపు సమస్యతో బాధపడే మహిళలు రోజూ రెండు అరటి పండ్లు తింటే గుణం కనిపిస్తుంది. సన్నగా పీలగా ఉన్నవారు రోజుకో రెండు పండ్లు తింటే బలంగా ఆరోగ్యంగా తయారవుతారు.
ఆరోగ్యవంతమైన దంతాలు, ఎముకల పటిష్టతకు దీనిలో వున్న కాల్షియం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ పండు స్వతహాగా జీర్ణంకాదు. ఇతర ఆహార పదార్థాలను
జీర్ణం చేయడంలో దీనికి సాటిరాగల పండు మరొకటి లేదు. అందుకే ఈ పండును పరగడుపున తినకూడదు.
ఎదిగే పిల్లలకు,ఎథ్లెట్లకు మేలుచేస్తుంది.
తక్కువ స్థాయి లవణాలు, లోఫ్యాట్, కొలెస్ట్రాల్ ఫ్రీ ఆహారాలతోఅరటిపండు మంచి పదార్థం. అరటి పండును ప్రతిరోజు అంటే
మలబద్ధకం సమస్య ఉండదు. ఫ్రూట్ సలాడ్లు, మిల్క్ షేక్ రూపంలోనూ దీన్ని తీసుకోవచ్చు. నెలల వయస్సు నుంచే అరటిపండు గుజ్జును పిల్లలకు తినిపించవచ్చు.రక్తం తక్కువగా వుండి బలహీనంగా వున్నవాళ్ళు క్రమం తప్పకుండా అరటి పళ్ళు తీసుకుంటుంటే రక్తవృద్ధి కలుగుతుంది. వైట్ డిశ్చార్జ్
సమస్యతో బాధపడే మహిళలు ప్రతిరోజూ కనీసం రెండు అరటి పళ్ళు తినడం వలన ఉపశమనం కలుగుతుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి