బీట్రూట్
ఎర్రగా చిదిమితే రక్తం చిందేలా కన్పించే బీట్ రూట్ లో ఎన్నో పోషకాలున్నాయి. పుట్టుకతో వచ్చే నరాల సంబంధితవ్యాధులను అడ్డుకోవడానికి, గుండె సంబంధిత జబ్బులు, ఊపిరితిత్తులు, కంఠ సంబంధ క్యాన్సర్లతో పోరాడడానికి అవసరమైన ఫాలేట్ దీనిలో పుష్కలంగా లభిస్తుంది.
అరకప్పు ఉడికించిన తాజా బీట్ రూట్ ముక్కల్లో 68 మైక్రో గ్రాముల ఫాలేట్ లభిస్తుంది. ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ తో ఇది సమానం.ఒక కప్పు పచ్చి క్యాబేజీ ముక్కలకు రెండింతలు ఫైబర్ (1,8 గ్రాములు) దీనిలో లభిస్తుంది. విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం,ఐరన్ లభిస్తాయి. కొవ్వులేని 37 క్యాలరీలు శరీరంలో చేరతాయి.
బీట్రూట్ లో తేనె కలిపి రోజూ తింటే గ్యాస్ట్రిక్, అల్సర్ క్రమక్రమంగా తగ్గుతాయి. బీట్ రూట్ ఆకులతో కూరవండుకుంటారు.బీట్ రూట్ గింజలను మెత్తగా నూరి అందులో తేనె కలిపి తాగితే సెక్స్ సామర్ధ్యం పెరుగు తుంది. ఆకులరసం, నిమ్మరసం కలిపి తాగితే కామెర్లు, మొలలు,గ్యాస్ట్రిక్స్ అల్సర్లు నయమైతాయి.
బీట్ రూట్ ఆకులలో ఎక్కువ మోతాదులో కాల్షియం, ఐరన్,ఫాస్పరస్ లభిస్తాయి. తాజా బీట్ రూట్ ముదురాకుపచ్చ ఆకులు కలిగి వుంటుంది. బీట్ రూట్ ఆకుల్ని తీసేసి ప్లాస్టిక్ కవర్ లో వుంచి ఫ్రిజ్ లో భద్రపరిస్తే మూడు వారాల వరకు చెడిపోవు.అయితే వాటిని ఉపయోగించడానికి ముందు బాగా కడగాలి.
బీట్ రూట్ ను పూర్తిగా, యధాతధంగా ఉడికించిన తరువాత పై తొక్కును తీసివేసి నట్లయితే వంటకం ఎర్రబారకుండా వుంటుంది. ఇది తరచుగా తినడం వల్ల రక్తం శుద్ధవుతుంది.
లివర్‌కు సంబంధించినవ్యాధులను రాకుండా చేయడమే కాకుండా, మూత్రపిండాలవ్యాధులు రాకుండా అరికడుతుంది.. శరీరానికి శక్తినిస్తుంది. దోస, బీట్ రూట్, ఉల్లికాడల రసం ఒక గ్లాసు తరచుగా తాగుతుంటే ఎముకలకు బలం వస్తుంది.
మలబద్ధకం చిన్న సమస్యే అయినా అది పెట్టే చికాకు అంతా ఇంతా కాదు. మలబద్ధకం తో సతమతమౌతూ ఇబ్బంది పడేవారికిఆ బాధను తప్పించే సహజసిద్ధమైన చిట్కా ఒకటి ఉంది. బీట్ రూట్లో ఉండే సెల్యులోజ్ అనే పదార్థం పేగుల్లో మలం ఎలాంటి అవాంతరాలు లేకుండా సులువుగా ప్రయాణించడానికి దోహదం చేస్తుంది. దీంతో మలవిసర్జన సాఫీగా అవుతుంది. కాబట్టి నిత్యం బీట్ రూట్ తింటే లేదా కషాయం రూపంలో తాగితే తీవ్ర మలబద్ధకం నుంచి విముక్తి కలుగుతుంది. ఫలితంగా మొలల వంటి ఇతర ఇబ్బందులు రావు.
నెలసరి సమయంలో జరిగే రక్తస్రావం వల్ల ఐరన్ లోపం ఏర్పడుతుంది. పురుషుల కంటే సంతానోత్పత్తి దశలో ఉన్న మహిళలకు ఏడు శాతం ఐరన్ ఎక్కువ అవసరం అవుతుంది. గర్భం ధరించినపుడు, బిడ్డలకు పాలిచ్చే సమయంలోనూ పోషకాలను ఎక్కువగా తీసుకోవాలి.ఆహారంలో ఐరన్ లోపం వల్ల తెల్ల కామెర్లు ( అనేమియా) వ్యాధి వేధిస్తుంది. ఈ సమస్య పదిహేను నుంచి నలభై నాలుగేళ్ల మధ్య వయస్కుల్లో ఎక్కువగా ఉంటుంది. ఐరన్ ఎక్కువగా అవసరమయ్యేది నష్టపోయేది కూడాఈ దశలోనే కాబట్టి నష్టాన్ని భర్తీ చేయకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బీట్రూట్ తీసుకోవడంతో ఐరన్ పెంచుకోవచ్చు.
వయసు మళ్లిన తరువాత మెనోపాజ్ సమయంలోనూ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే, అప్పుడు ఎదురయ్యే హార్మోన్ల అసమతుల్యతను ఎదుర్కోవాలంటే మహిళలు తినే ఆహారంలో కాల్షియం పుష్కలంగా ఉండాలి.ఆహారం సక్రమంగా తీసుకోకపోవడం వల్ల కూడా మహిళల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.
కాల్షియం లోటు కూడా తరచూ ఏర్పడుతుంటుంది.గర్భవతులు, పాలిచ్చే తల్లులకు దీని అవసరం ఎక్కువ. ఆ సమయలలో కాల్షియం సరిపడా లేకపోతే చిక్కులెక్కువ.
మూఢనమ్మకాలతో, మతపరమైన ఆచారాలతో కొందరు స్త్రీలు గర్భంతో ఉన్నపుడు పోషకపదార్థాల గురించి పట్టించుకోరు.ప్రత్యేకించి విటమిన్ ఎ, ఫోలిక్ యాసిడ్, ఐరన్ల లోటు వల్ల బిడ్డ ఎదగడంలో లోపాలు కనపడుతుంటాయి.
భారతదేశంలో అయొడిన్ లోపం వల్ల గాయిటర్ వ్యాధి సంక్రమించడం విస్తృతంగా కనపడుతుంది. ఇది తల్లికే కాదు.గర్భస్థ శిశువుకూ నష్టం కలుగజేస్తుంది. ఇవన్నీ బీట్రూట్ తీసుకోవడంతో పరిష్కరించుకోవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి