బొప్పాయి


బొప్పాయి
             

       మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది.  మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్లతోట. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పరందపుకాయ, పరింకాయ, మదన ఆనపకాయ అని  కూడా బొప్పాయిని పిలుస్తుంటారు.
       బొప్పాయికాయ ఆకుపచ్చరంగులో ఉండి పక్వానికి రాకముందు ఔషధ   గుణాలను కలిగి ఉంటుంది. పండిన బొప్పాయిలో ఎంజైములు,
క్రిమినాశనాలు తక్కువ. బొప్పాయికాయను పచ్చడి రూపంలో, కూర రూపంలోనూ,వాడుకోవచ్చు. 
      డెంగీ వ్యాధి గురైన వారు బొప్పాయి ఆకుల రసం తాగితే శరీరంలో రక్త కణాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి.బొప్పాయి ఆకును మెత్తగా నూరి బోదకాలు పైన కట్టుకడితే కాలు మెత్తబడి నొప్పిని నివారించి ఉపశమనం కలుగచేస్తుంది.శరీరంపై కురుపులు, గడ్డలు ఉన్నా వాటిని నివారిస్తుంది.బొప్పాయి ఆకులను నూరి కట్టుకట్టాలి.బొప్పాయి ఆకుల్ని మెత్తగా నూరి ప్రారంభదశలో ఉన్న బోదకాలు భాగంలో
పట్టుగా చేస్తూ, బొప్పాయి పండ్లరసం ఎండించి కుంకుడు గింజ ప్రమాణం మాత్రలు చేసి రెండు పూటలూ వేసుకుంటుంటే క్రమంగా
వాపు తగ్గుతుంది.బొప్పాయి ఆకుల రసాన్ని వారం రోజులు ఉదయం సాయంత్రం తాగితే
డెంగ్యూ వ్యాధిని నివారించి పడిపోతున్న తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతుంది. 
       
        బొప్పాయి పాలను గజ్జి, చిడుము వంటి
చర్మవ్యాధులపై పట్టిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. దీనిపాలలో పొక్కే గుణం ఉంటుంది. కాబట్టి కొబ్బరినూనె లేదా నెయ్యి కలిపి చర్మవ్యాధులపై పూయటం మంచిది.
తేలు కుట్టిన చోట బొప్పాయికాయ పాలను పట్టించి ఒకస్పూను పాలను మంచదారతో కలిపి సేవిస్తే శీఘ్ర ఉపశమనం కలుగుతుంది. ముసాంబ్రం (పచారి కొట్లలో దొరుకుతుంది)ను బొప్పాయి పాలతో నూరిసెనగింజంత మాత్రలు చేసి రోజూ రెండు పూటలా ఒక్కొక్క మూత్ర వంతున తీసుకుంటుంటే స్త్రీలలో రుతుస్రావం బాగా జరుగుతుంది. 
         నేడు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం, పురుగుమందుల అవశేషాలున్న
ఆహారపదార్థాలు వాడకం, ఆహార పదార్థాల నిల్వకు వాడే రసాయనాలు, నియమబద్ధ జీవనవిధానం లేకపోవడం, ధూమపానం,మానసిక ఆందోళన తదితర కారణాల వల్ల మన శరీరంలో  ఫ్రీరాడికల్స్ అనే రసాయనిక పదార్థాలు ఉత్పత్తయి ఎన్నో రుగ్మతలకు కారణమవుతున్నాయి. 
         ప్రకృతి సిద్ధమైన బొప్పాయి వాడితే అవి ఈ ఫ్రీరాడికల్స్ ని తటస్థపరిచే ఎంజైములను పెంచి, వాటిని నిర్వీర్యపరచి ఆయా వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తాయి.
        బొప్పాయి ముక్కల్ని కొద్దిగా జీలకర్ర, మిరియాలు కలిపి రోజుకోసారి తింటూంటే మలేరియా జ్వరం వల్ల కలిగే ప్లీహ (స్ప్లీన్)
అనే అవయవ వాపు తగ్గి బాధ నివారణవు తుంది. బొప్పాయిలో ఉండే ఈస్ట్రోడియాల్ అనే సెక్స్ హార్మోన్ గర్భస్రావానికి దోహదపడు తుంది.      
          మన ఇళ్లలో పెంచుకునే కుక్కల్లాంటి పెంపుడు జంతువులకు ఎండించిన విత్తనాల చూర్ణం ఒక స్పూను వంతున ఉదయం, రాత్రి పాలలో కలిపి కొద్దిగా బెల్లం కలిపి మూడు
రోజులపాటు తాగిస్తే వాటి కడుపులోని క్రిములు నశించి ఆరోగ్యంగా హుషారుగా ఉంటాయి. అప్పుడప్పుడు ఇలా చేస్తుంటే అతి చౌకైన వైద్యంతో వీటిని క్రిముల బారి నుంచి రక్షించవచ్చు.         
            బొప్పాయి పువ్వుల రసం తలకు దట్టంగా పట్టించినట్లయితే వెంట్రుకలు రాలడాన్ని నివారిస్తుంది. బొప్పాయి పువ్వును నలిపి పేనుకొరికిన చోట రోజూ రెండు మూడు సార్లు రుద్దుతుంటే ఆ ప్రాంతంలో మరల వెంట్రుకలు వస్తాయి.
            రోజూ బొప్పాయిపండు 100 గ్రా తింటుంటే తామర తగ్గిపోతుంది. కఫ వ్యాధులను హరించే గుణం దీనికి ఉంది.బొప్పాయి చెక్కను మొటిమలపై రాస్తూ త్వరలో తగ్గిపోతాయి.   
        అతి తియ్యగా, రుచిరకంగా ఉండే బొప్పాయిపండులో 'ఎ'విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.  రక్తస్రావాన్ని అరికడుతుంది. రక్తం కారే మొలలకు కూడా ఈ బొప్పాయిపండు అమోఘంగా పనిచేస్తుంది.బీటా కెరోటిన్, బి,సి విటమిన్లు ఈ పండులో ఎక్కువగా ఉన్నాయి. బొప్పాయి నుండి పెపైన్ అనే ఎంజైమ్ తయారవుతుంది. ఆకలిని వృద్ధి చేయడంతో పాటు స్త్రీలకు పాలు పెరిగేలా చేయడంలోనూ, పుండ్లు మానిపోయేటట్లు చేస్తుంది.     
       బొప్పాయి చెట్టు నుండి కారే పాలను రాసినట్లయితే గజ్జి, తామర, దురద పొక్కులు సమసిపోతాయి.అంతేకాక బొప్పాయి చెట్టు పాలు ఒక స్పూను తీసుకుని అందులోకొద్దిగా చక్కెర కలుపుకుని త్రాగితే కామెర్లు తగ్గుతాయి. ఈ పాలను పుటం పెడితే తెల్లనిపొడి తయారవుతుంది. ఈ పొడి కామెర్లకు అద్భుతంగా పనిచేస్తుంది.       
           పండిన బొప్పాయిలో గుజ్జును పిండి రసం తీసి వేసవిలో శరీరానికి రాసుకుంటే కళ్ళ వేడిని అరికడుతుంది. బాగా పండిన బొప్పాయిని తింటే విరేచనం సాఫీగా అవుతుంది. 
             
        బొప్పాయికాయని కూరగా వండుకొని తరచుగా తింటుంటే జఠరాగ్ని బాగా వృద్ధిచెంది జీర్ణశక్తి మెరగవుతుంది. బాలింతల్లో
 స్తన్యం సమృద్ధిగా ఉత్పత్తవుతుంది. ఆ తల్లిపాలు తాగితే పసిబిడ్డలకు కలిగే అజీర్ణం, విరేచనాల వంటి వికారాలు తొలగిపోతాయి. 

        బొప్పాయి కాయ ప్రకృతి సిద్ధంగా లభించే ఎంజైములతో నిండి ఉంటుంది. దీన్ని కాయ రూపంలో తీసుకోవడం వలన మన శరీరానికి
ఆయా పోషకాలు లభిస్తాయి. వీటి ద్వారా శరీరావయవాలు, జీర్ణకోశం మీద ఒత్తిడి తగ్గి జీర్ణశక్తి పెరుగుతుంది. మాంసకృత్తులు
జీర్ణమయ్యేందుకు తోడ్పడే పపైన్, కైమోట్రిప్సిన్ అనే రెండు ముఖ్యమైన ఎంజైములు బొప్పాయికాయలో ఉన్నాయి. అందుకే మాంసం వండేటపుడు, మెత్తపడటానికి పచ్చిబొప్పాయి ముక్కలు వేస్తారు.ఆహారంలో బొప్పాయి తీసుకుంటే త్వరగా జీర్ణమ య్యేందుకు, ఎంజైమ్ ద్వారా ఆయా పోషకాలు శరీరం గ్రహించడానికి వీలుగా అనువైన రూపంలో మార్చి శరీరం శక్తి పుంజుకునేలా తోడ్పడుతుంది.బొప్పాయి కాయలోని మాంసకృత్తుల్ని జీర్ణం చేసే పపైన్ అనే ఎంజైము పండులో కంటే కాయలో ఎక్కువ శాతంలో ఉండి తేలిగ్గా జీర్ణమవు తుంది. ముదురు మాంసంలోను, ఉడకడం కష్టంగా ఉండే కూరల్లోను బొప్పాయికాయ ముక్కను వేసి వండితే చాలా సులభంగా త్వరగా మెత్తగా ఉడికితినటానికి అనువుగా ఉండి అజీర్తి బాధలు కలుగకుండా ఉంటాయి.బొప్పాయి కాయని చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఎండించి మెత్తటి అరటి- బొప్పాయిపౌడరు చేసి రోజూ మూడుసార్లు అరస్పూను ప్రమాణం తగినంత తేనెలో కలిపి తీసుకుంటే మలబద్ధకం, కడుపునొప్పి, అజీర్తి, వికారాలు,అరుచి, ఆకలి లేకపోవడం లాంటి ఉదరసంబంధ వికారాలు తొలగిపోతాయి.
        వృక్ష సంబంధిత రసాయనాలైన 'ఫైటో కెమికల్స్' అందించడం ద్వారా బొప్పాయి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు తోడ్పగలదని పరిశోధకుల అభిప్రాయం.
         పచ్చికాయకు గాటు పెట్టి పాలను సేకరించి నిలువ చేయకుండా త్రాగడం ఉత్తమమైన పద్ధతి. స్త్రీలు ఈ పాలను అధికంగా త్రాగినట్లయితే రుతుస్రావం అమితంగా అవుతుంది. గర్భస్రావమయ్యే ప్రమాదం కూడా వుంది.
        పచ్చికాయను తరిగి కూర వండుకుని తింటే తల్లులకు పాలు సమృద్ధిగా ఉత్పత్తి అవుతాయి. బొప్పాయి పచ్చికాయపైన తోలు తీసి ముక్కలుగా చేసి ఎండబెట్టి వడియాల్లాగా ఉపయోగించు కోవచ్చు. లేకపోతే పొడిగా కొట్టుకుని తగినఉప్పు, కారం కలిపి భోజనంలో తీసుకొనవచ్చును. తేనెలో కలిపి ఆకలి మందగించడం, అజీర్తి, మలబద్ధకం, బలహీనం, రక్తలేమివలన శరీరం పాలిపోవడం, కడుపులో నులిపాములు  ఈలక్షణాలన్నిటికీ ఈ పొడి అమోఘంగా పనిచేస్తుంది. కామెర్ల వ్యాధికితిరుగులేని దివ్య ఔషధం. నీరు పట్టిన శరీరానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయికాయను కొబ్బరికోరులాగా తరిగి ఆముదం కలిపివెచ్చని ఆయా భాగాల పై వేసికట్లు కడుతుంటే వృషణాలవాపు, స్తనాల్లో గడ్డలు, నొప్పులు, రొమ్ము నొప్పి, పోటు తగ్గుతాయి.
       ‌బొప్పాయికాయలోని ఆల్కలాయిడ్స్ క్రిమిసంహార శక్తి కలిగిన వైరస్, అమీబా, బ్యాక్టీరియా వంటి సూక్ష్మ క్రిముల్ని నశింపజేస్తాయి. తరచు బొప్పాయికాయ తీసుకోవడం ద్వారా జీర్ణకోశంలోని పుండ్లు నివారించవచ్చు. శస్త్రచికిత్స తర్వాత రోగి త్వరగా కోలుకోవడానికి పచ్చి బొప్పాయికాయ వాడితే మంచిదని వైద్యులు సూచిస్తారు.
      

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid