మెగ్నీషియంతినండి.. ఆరోగ్యంగా ఉండండి!
👉మెగ్నీషియం.. ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరమైనది. ఇది శరీరంలో అనేక జీవరసాయన ప్రతిచర్యలకు మద్దతు ఇస్తుంది. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం లేకపోతే.. కిడ్నీలు తమ వద్ద ఉన్న మెగ్నీషియంను అందించి ఆదుకుంటుంది. ఇది ఇలాగే కొనసాగితే, చివరకు మూత్రపిండాలు చెడిపోతాయి. ఇది మాంసకృత్తుల తయారీ, పిండిపదార్థాల జీవక్రియలో సహకారకంగా పనిచేస్తుంది. తగినంత మెగ్నీషియం తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటు వంటి గుండె జబ్బులతో ముడిపడి ఉన్న ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా పెంచుతుంది. 👉నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. మెగ్నీషియం యొక్క రోజువారీ అవసరం పురుషులకు 400-420 మి.గ్రా, b 350-360 మి.గ్రా. అవసరం. మెగ్నీషియం శరీరానికి శక్తిని ఇస్తుంది. చక్కటి నిద్ర వచ్చేలా చేస్తుంది. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. హార్మోన్స్ సరిగా పనిచేసేందుకు సాయపడుతుంది. మనం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం సరైన పాళ్లలో శరీరానికి అందాలి. మన శరీరంలో వందల కొద్దీ ఎంజైంల పనితీరును మెగ్నీషియం మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట...