ఎక్మో చికిత్స అంటే ?
బాలసుబ్రహ్మణ్యం చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం విషమంగా మారింది.ప్రస్తుతం వారికి ఎక్మో మెషీన్ ద్వారా చికిత్స అందిస్తున్నారు.(ఇదే ఎక్మో చికిత్స తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారికి కూడా 2016 లో అందించారు) *ఎక్మో* ( *ECMO* ఈసీఎంఓ) అంటే ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్(Extra Corporeal Membrane Oxygenation). *ఆపదలో ప్రాణ రక్షణ ఎక్మో* *ఎక్మో...* అత్యాధునిక వైద్య విధానం! సుదీర్ఘ అస్వస్థత నుంచి కోలుకుంటున్న దశలో ఉన్నట్టుండి గుండెపోటు ముంచుకురావటం, అత్యవసరంగా ‘ఎక్మో’ యంత్రం మీద ఉంచి కొన్ని గంటల పాటు చికిత్స అందించటంతో దీనిపై అందరికీ ఆసక్తి పెరిగింది. అసలేమిటీ యంత్ర చికిత్స? దీన్ని ఎవరికి చేస్తారు? దీంతో ఎంత క్లిష్టమైన సందర్భాన్నైనా అధిగమించొచ్చా?.. ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ప్రజల్లో ఉత్సుకతను రేకెత్తించాయి. ఈ నేపథ్యంలో ఈ అత్యాధునిక చికిత్సా విధానానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసు కుందాం... పదండి... ఎక్మో’ ఇప్పుడు విస్తృతంగా చర్చలోకి వస్తున...