సంపూర్ణ ఆరోగ్యానికి ఒకే ఒక పరిష్కారం ఓమేగా -3
ఒమెగా -3 ఫాటీ ఆమ్లాలు మానవుని సంపూర్ణ ఆరోగ్యంలో కీలకపాత్ర వహిస్తున్నాయని ప్రముఖ
వైద్యులు డా.కె. విజయ్‌శుక్లా చెపుతున్నారు. ఈ ఫాటీ ఆమ్లాలు మానవుల శరీరంలో తనంతతాను ఉత్పత్తికావు కాబట్టి తప్పనిసరిగా వీటిని ఆహారం ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. చేపల్లో ఇది అధికంగా దొరుకుతుంది. చేపల్లో ప్రోటీన్లు అధికం, కొవ్వులు తక్కువ. అలాగే అవిసె గింజల్లో కూడా ఇది అధికమే.
ఒమేగా-3 ఎందుకంత ప్రధానమైనది ?
ఒమేగా -8 మెదడు పనిచేయటంలోనే గాక మెదడు అభివృద్ధిలో, పెరుగుదలలో చాలా కీలకంగా
పనిచేస్తుంది. ఇది వాపులను తగ్గించటమేగాక, గుండె జబ్బులను నివారిస్తుంది. క్యాన్సర్, మోకాళ్ళనొప్పులను రానీయకుండా చేయగలుగుతుంది. గర్భవతులుగా ఉన్నప్పుడు తల్లి నుండి ఒమేగా-౩ సరిగాపాందనిబిడ్డలు తరువాత దృష్టి దోషాలకు, నరాల సమస్యలకు గురవుతారు. ఒమేగా-3 లోపించినపుడు అలసటరావడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, చర్మం పొడిబారటం, గుండె సమస్యలు, డి(పెషన్, రక్తప్రసరణ సరిగాలేక తిమ్మిర్లు ఏర్పడటం మొదలైన వ్యాధులు వస్తుంటాయి.
1. గుండెజబ్బులు:
గుండెజబ్బులు రాకుండా ఉండాలంటే సంతృప్త క్రొవ్వుపదార్థాలను (సాచురేటల్ ఫ్యాట్)తక్కువగా తీసుకోవాలి. మోనోఅన్ శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్‌లు అధికంగా గల ఒమేగా -3 ఆమ్లాలను అధికంగా తీసుకోవాలి. చేపల నూనెలలో టైగిజరాయిడ్స్ చాలా తక్కువ. ఈ నూనెను తీసుకుంటే గుండె పదిలంగా ఉంటుంది.
గుండె జబ్బు గలవారు తక్కువ కొవ్వు వుండే పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్,చేపలు, నట్స్ (పప్పులు) నుంచి వచ్చే కొవ్వు కొలస్రాల్ పరిమాణాన్ని పెరగనీయకుండా చేస్తుంది. చేపలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకెంతో మేలుచేస్తాయి.
ఆలివ్ ఆయిల్ నట్స్‌లలో ఉండే విటమిన్ -ఇ, ఎల్‌డిఎల్‌లు గుండెలో బ్లాక్‌లు ఏర్పడకుండా ఆరోగ్యం గా ఉండేలా సహకరిస్తాయి. వారానికి రెండు లేదా మూడుసార్లు చేపలు తింటే గుండెకి మంచిది.
అలాగే మాంసాహారాన్ని వండేటప్పుడు ఆలివ్ ఆయిల్‌ని ఉపయోగిస్తే మంచిది. ప్రతి రోజూ మీరు
తీసుకునే ఆహారానికి నాలుగు బాదం గింజల్ని కూడా చేర్చండి. విటమిన్-సి ఎక్కువగా తీసు కోవడం వల్ల రక్తనాళాలు పటిష్టపడి ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్-సి యాంటాక్సీ డెంట్ గా పనిచేస్తుంది.
రక్తపోటు క్రమబద్ధంగా ఉంటుంది. మీరు తీసుకునే ఆహారంలో పళ్లు, కూరగాయలు తప్పనిసరిగా
ఉండాలి. వీటిల్లో పైరోనాయిడ్స్ అనే ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి విటమిన్ -సి కున్న యాంటాక్సిడెంట్ లక్షణాన్ని పెంచుతాయి.
సల్ఫర్ ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండే వెల్లుల్లి, ఉల్లిగడ్డలు కూడా గుండెకి రక్తాన్ని పంపే నాళాలన
౨ ఆరోగ్యంగా ఉంచుతాయి. ప్రతి రోజూ మీరు తీసుకునే సలాడ్‌లో వెల్లుల్లి సన్నగా తరిగి తీసుకోండి. అలాగే ఉల్లిపాయల్ని కూడా సన్నగా తరిగి సలాడ్‌లో కలిపి ఆహారంతో పాటు తీసుకోవాలి.
మానసిక ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉన్నప్పుడు రక్తంలో హోమోసిస్టైన్ ప్రమాణం అపరిమితంగా
పెరుగుతుంది. ఫోలిక్ యాసిడ్, బి6, బి12లు ఉండే ఆహారాన్ని తీసుకుంటే ఈ హపోమోసిస్టైన్ పెరుగుదల ను నియంత్రించవచ్చు.
ఆకుకూరల్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. కమలాపళ్లలో కూడా ఇది బాగా ఉంటుంది. బి
6 (ఫైరోడాక్సైన్) విటమిన్ అరటిపళ్లు, బంగాళదుంపలు, చేపలు, పచ్చి బఠానీల్లో ఉంటుంది. గ్రుడ్లు, డైరీ ఉత్పత్తులు, చేపలు, మాంసం, ఫౌళ్రీ ఉత్పత్తులు తినాలి.
2. బి.పి. (రక్తపీడనం) :
అధిక రక్తపీడనంగల వారు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు తీసుకున్నప్పుడు వారిలో బి.పి. గణనీయంగా తగ్గిపోవటాన్ని పరిశోధకులు గుర్తించారు. రోజూ 3 గ్రాముల చేపనూనె అదనపు ఆహారం (సప్లిమెంట్)గా తీసుకుంటే బి.పి. తగ్గిపోవడాన్ని డాక్టర్లు గుర్తించారు.
౩. చక్కెర వ్యాధి:
చక్కెర వ్యాధిగ్రస్థులు (డయాబిటిస్) ముఖ్యంగా టైప్-2 ఉన్నవారిలో ట్రైగ్రిజరాయిడ్స్ ఎక్కువగానూ, హెచ్.డి.ఎల్. స్థాయి తక్కువగానూ ఉంటాయి. వీరు ఒమేగా-3 క్రమం తప్పకుండా తీసుకుంటే టైగ్లిజరాయిడ్స్ తగ్గి, గైసీనిక్ నియంత్రణపై ఎలాంటి చెడు ప్రభావం లేకుండా ఉండటాన్ని గమనించారు. చక్కెర వ్యాధి ఉన్నవాళ్ళలో రక్తనాళాలు ఎక్కువగా గట్టిపడిపోతుంటాయి. ఒమేగా-3 వీటిని అలా గట్టి
పడకుండా చేయడాన్ని గుర్తించారు.
4. రొమ్ము క్యాన్సరు :
రొమ్ముక్యాన్సరు రాకుండా ఒమేగా-3 రక్షనగా నిలబడుతుందని ఒక సర్వేలో పరిశోధకులు గుర్తించారు. ఒమేగా-3ని ఆహారంగా ఎక్కువగా తీసుకున్న సందర్భాలలో ప్రొస్టేట్ క్యాన్సర్ పెరుగుదలను అరికట్టడమే కాకుండా, వ్యాధి తీవ్రతను గణనీయంగా తగ్గిస్తుంది. జీవితకాలాన్ని పెంచుతుంది.
5.మతిమరుపు:
ఎదుగుతున్న చిన్నపిల్లల్లో అతి చురుకుదనాన్ని లేదా మందబుద్ధిని లేదా రెండూ ఉన్నప్పుడు ఒమేగా-౩ చక్కగాపనిచేసి వారిని సరైన పద్ధతిలో పెరగడానికి దోహదం చేస్తుంది.
6. ఆస్త్మా :
ఒక పరిశోధనలో తేలిందేమంటే ఆస్త్మా వున్న పిల్లల్లో ఈ.పి.ఏ., డి.హెచ్.ఏ. అధికంగా ఉన్న ఒమేగా-8 ఇచ్చినప్పుడు ఆస్మా లక్షణాలు బాగా తగ్గి పోయినాయని పరిశోధనలు తేలింది.
7.పక్షవాతం : ఆహారంలో రోజూ కాసింత ప్రోటీన్ అదనంగా ఉండేలా చూసుకోవాలి. ఇది చేపల వంటి సముద్ర ఆహారం నుంచి లభించేదైతే మరీ మంచిది. ఎందుకంటే ప్రోటీన్ ముఖ్యంగా చేపల నుంచి లభించే ప్రోటీన్ అధికంగా తీసుకొనేవారికి పక్షవాతం ముప్పు తగ్గుతున్నట్లు తాజా అధ్యయనంలో బయటపడింది. పరిశోధకులు 2.5 లక్షల మందిపై అధ్యయనం చేసి మరీ ఈ విషయాన్ని కనుగొన్నారు. సాధారణంగా
మగవారికి రోజుకు 56 గ్రాముల ప్రోటీన్ అవసరం. అదే మహిళలకైతే 46 గ్రాములు కావాలి. అయితే
రోజూ దీనికి అదనంగా 20 గ్రాముల ప్రోటీన్ తీసుకున్నా పక్షవాతం ముప్పు 26% వరకు తగ్గుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. మాంసం లేదా ధాన్యం గింజల నుంచి లభించే ప్రోటీన్ కన్నా సముద్ర ఆహారం నుంచి లబించే ప్రోటీన్ తీసుకునే వారికి ఈ రక్షణ మరింత ఎక్కువగా ఉండటం గమనార్హం. చేపల్లోని ప్రోటీన్, కొవ్వు ఆమ్లాలు రక్తపోటు తగ్గటానికి తోడ్పడతాయి. ఇవి పక్షవాతం బారినపడకుండా కాపాడుతుండొచ్చని భావిస్తున్నారు.
8. చలాకీతనం: పిల్లలు మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఏంచేయాలని తల్లులు తలలు పట్టుకుంటారు.వారికో గుడ్ న్యూస్. కంటికి మంచిదని చెప్పే చేపలో ఆ సుగుణం కూడా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. గర్భిణులు చేపలు ఎక్కువగా తింటే పుట్టబోయే పిల్లలు చురుగ్గా ఉంటారని అమెరికాకు చెందిన ఇల్లినాయిస్ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ సైన్స్‌కి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. చేపల్లో ఒమెగా -3 ఫ్యాటీ ఆసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి గర్భంలో ఉండే శిశువు మెదడుని చురుగ్గా ఉండేటట్లు చేస్తాయి. అంతేకాదు నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిని తినడం వల్ల పిల్లల జ్ఞాపకశక్తి పెరగడమేకాక ఎదిగేపిల్లలకు చేపలు పెడితే వాళ్ల ఎముకలు కూడా చాలా బలిష్టంగా తయారవుతాయి.
వారంలో మూడు సార్లు చేపలు ఆహారంగా తీసుకుంటే పుట్టే పిల్లలు చదువులో చురుగా
ఉంటారు. ఇదేదో ఆషామాషీగా చెప్పింది కాదు. ట్రిటీష్, అమెరికన్ వైద్యులు సుమారు పన్నెండు వేలమంది గర్భిణుల మీద ఏడాది పాటు నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని నిర్ధారించింది. వారిలో సగం మందికి వారానికి 340గ్రాముల సముద్రపు చేపల్ని అందించారు. మిగిలిన సగం మందికి 170 గ్రాములే ఆహారంగా ఇచ్చారు. వారందరూ ప్రసవించి, పిల్లలు ఎనిమిదేళ్ల వయసాచ్చాక లోతైన అధ్యయనంజరిపారు. దానిలో 340 (గ్రా చేపలు తీసుకున్న పిల్లలు చదువు, ఆటపాటలు, సామాజిక కార్యక్రమాల్లో
చురుగ్గా ఉన్నారు. మిగతా వారు మామూలు పిల్లల్లానే మసిలారని తేలింది. గర్భవతులు చేపలు, అవిశెగింజలు, వాల్‌నట్స్ ఎక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యనిపుణుల సలహా.
చేపలు తినడం వలన ఉపయోగాలు:
- రక్తనాళాలు మూసుకుపోవటాన్ని తగ్గిస్తుంది.
- దెబ్బతిన్న ధమనులు త్వరగా కోలుకునేలా చేస్తాయి.
- రక్తపోటును తగ్గిస్తాయి.
- రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.
- జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఇబ్బందలు రానివ్వవు.
- ముఖ్యంగా క్యాన్సర్‌కి చేపలే విరుగుడు.
- కణజాలాల వాపును తగ్గిస్తుంది.
- కీళ్ళ ఇబ్బందులను రానివ్వదు.
- నాడివ్యవస్థలో లోపాలను ఏర్పడనివ్వదు.
- గుండెదడను తగ్గిస్తుంది. గుండె కొట్టుకునే తీరును స్థిరపరుస్తుంది.
- డిప్రెషన్‌కు గురికారు. మెదడుకు సంబంధించిన ఇబ్బందులు ఎదురవ్వవు.
- శరీరంలో ఎర్రరక్త కణాలను మెరుగ్గా చేస్తుంది. చర్మం నిగారింపు నిలిచి వుంటుంది.
ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ వలన ఇతర ఉపయోగాలు:
ఆర్హయిటీస్. ఎలర్జిటిక్ రైనిటిస్, పప్రోస్టయిటీస్, సిస్టిటిస్ వంటి ఇన్‌ప్లేమేషన్‌కు సంబంధించిన వ్యాధులలో - మీరు ఉపయోగించే మందులకు జతగా ఒమేగా-3 సప్లిమెంట్స్ (ఫిష్‌ఆయిల్స్) కూడా వాడితే నొప్పి త్వరగా తగ్గిపోతుంది. ఇన్‌ఫ్లమేషన్ (మంట) తగ్గుముఖం పట్టి క్రమంగా వ్యాధి బాధలు తగ్గుతాయి.
మెమరీ రీకాల్, రీజనింగ్ తదితర ట్రెయిన్ సంబంధమైన ఫంక్షన్స్‌ను ఇవి బాగా మెరుగుపరిచి, బ్రెయిన్ ఫంక్షనింగ్‌ను శక్తివంతం చేస్తాయి.
డిప్రెషన్‌ను తగ్గించే శక్తి వీటికి ఉందని యూనివర్శిటీ ఆఫ్ షెఫీల్డ్ పరిశీధకులు రుజువు చేశారు.
ఫెర్టిటిటీ అవకాశాలను అటు మహిళల్లో, ఇటు మగవారిలో పెంచి... సంతానహీనతతో బాధపడేవారికెంతో సహకరిస్తాయి.
ఓవర్‌యాక్టివ్ పిల్లలలో అద్భుతమైన మార్పు తేగల శక్తి ఈ ఫిష్ ఆయిల్స్‌కు ఉంది.
ట్రెస్ట్, ప్రొస్టేట్, కోలన్ కేన్సర్‌లను రానీయవు.
రక్తంలో టైగిసరైడ్స్‌ను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
సైడ్ ఎఫెక్ట్స్ అనే అనుమానం రావచ్చు. రావటం సహజం కూడా. ఇది చేపనూనె నుంచి లభించే నేచురల్ పదార్థమే తప్ప మందు కాదు. ఈ రోజు చేపలకూర బాగుందికదా అని రెండు చేప ముక్కలు ఎక్కువ తింటే... సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా ? రావు. ఇదీ అంతే. ఎక్కువకాలం తీసుకోవాలనుకుంటే రోజూ ఒకటి చాలు. కొంత కాలం వాడుకోవాలనుకుంటే రోజుకు రెండు చాలు.
మహిళల ఆరోగ్యానికి మహత్తర రక్ష ఒమేగా -3:
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కేవలం గుండెకు మాత్రమే మేలు చేస్తాయనుకోవడం పొరపాటే. వీటి వలన మహిళలకు ఎన్నో రూపాలలో మేలు జరుగుతుందని రుజువయ్యింది.
వీటిని సప్లిమెంట్స్‌గా తీసుకొనే మహిళలలో ట్రెస్ట్‌కేన్సర్ సంభవించే అవకాశం 50% వరకు తగ్గినట్లు రుజువయ్యింది.
శ$ ఫిష్ ఆయిల్స్ హార్మోన్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. అవసరం అయిన హార్మోన్స్ లెవల్స్‌ను పెంచుతాయి.
గర్భసంచికి రక్తప్రసరణను అధికం చేస్తాయి. ఫలితంగా సంతానయోగ్యత మరింతగా పెరిగి వంధ్యత్వ బాధ తొలగిపోతుంది. స్రీలు సంతానవతులవుతారు.
గర్భిణులు ఈ సప్లిమెంట్స్ వాడితే - పుట్టబోయే పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా జన్మిస్తారు. తల్లి నుండి గర్భస్థ శిశువుకు రక్తం, ఆక్సిజన్, పోషకాలు సక్రమంగా అందేలా చేస్తుంది.
కొందరు మహిళలు గర్భధారణ సమయంలో హై బి.పి.కి గురవుతారు. ఇది ఎంతో ప్రమాదకరం.
ఒమేగా-౩ యాసిడ్స్ ఈ రిస్క్‌ను చాలా వరకు తగ్గిస్తాయి.
ప్రెగ్నెన్సీ సమయంలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకుంటే - ప్రేమెచ్యూర్‌టీ జననం నివారించ
వచ్చును.డెలివరీ అయ్యాక మహిళలలో డిప్రెషన్ లక్షణాలు సంభవించడం కూడా జరుగుతుంది. ఈ డిప్రెషన్‌ను కూడా నివారిస్తాయి.
పుట్టబోయే పిల్లలలో మెదడు పెరుగుదల బాగుంటుంది.
మెనోపాజ్‌లో సంభవించే ఎన్నో రకాల ఇబ్బందులు కూడా తగ్గుతాయి.
ఎక్కువ మంది మహిళలు గురయ్యే అస్టియోసోరోసిస్ అనే ఎముకలకు చెందిన ప్రాబ్లం రాకుండా ఇవి కాపాడుతాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి