కరోనా ఇన్ఫెక్షన్లు _ రకాలు ఆ లక్షణాలు ఉంటే జాగ్రత్త వహించాలి.


         కరోనా వైరస్  ఎలా సోకుతుందో ఎవరికి సోకుతుందో అనే విషయం పై ఇంకా స్పష్టత లేదు. కొంతమందిలో స్వల్ప లక్షణాలు బయటపడితే మరికొందరు మధ్యస్థ లక్షణాలుతో బాధపడుతున్నారు. ఇంకొందరిలో అయితే అసలు లక్షణాలే కనిపించట్లేదు. దీనితో కరోనా వైరస్ సంక్రమణ వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే లండన్ లోని కింగ్స్ కాలేజ్ పరిశోధకులు ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో కరోనా ఇన్ఫెక్షన్లు ఆరు రకాలుగా ఉన్నాయని కనుగొన్నారు.
          కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిలో మొదటి వారంలో ఉన్న లక్షణాల ద్వారా వైరస్
తీవ్రత ఎంత ఉంటుందో చెప్పగలమని మార్చి- ఏప్రిల్ మధ్యకాలంలో అమెరికా బ్రిటన్ కు చెందిన 1600 మంది కరోనా రోగులపై పరిశోధకులు అధ్యయనం చేశారు.
మొదటి 8-10 రోజుల్లో వారు అనుభవించిన లక్షణాల వివరాలను వెల్లడించమని
కోరారు. మూడు క్లస్టర్లు గల అంటువ్యాధులు స్వల్ప లక్షణాలు ఉన్న రోగుల్లో.. మరో
మూడు క్లస్టర్లు మధ్యస్థ లక్షణాలు ఉన్న రోగుల్లో ఉన్నాయని గుర్తించినట్టు తెలిపారు.

1. జ్వరం లేకుండా ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్:

       వైరస్ సంక్రమణలో ఇది తేలికపాటి రూపం కాగా, ఈ ఇన్ఫెక్షన్ నుంచి
బాధపడేవారిలో జలుబు గొంతు నొప్పి ముక్కు దిబ్బడ ఛాతీ నొప్పి కండరాల నొప్పి
వాసన కోల్పోవడం తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. ఈ సంక్రమణ దశలో మాత్రం జ్వరం ఉండదు.

2. జ్వరంతో కూడిన ఫ్లూ లాంటి ఇన్ఫెక్షన్ :

      ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన రోగులు తేలికపాటి ఫ్లూ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే జ్వరం
కూడా ఉంటుంది. ఆకలి తగ్గడం పొడి దగ్గు గొంతుక మొద్దుబారడం వంటివి కూడా
ఉంటాయి.

3. జీర్ణశయాంతర సంక్రమణ:

           ఈ క్లస్టర్ కు చెందిన రోగులు వారి జీర్ణక్రియను ప్రభావితం చేసే లక్షణాలతో
బాధపడతారు. దగ్గు, వికారం ఆకలి లేకపోవడం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తలనొప్పి ఛాతీ నొప్పి స్వల్పంగా ఉంటుంది.

4. తీవ్ర ఇన్ఫెక్షన్, నీరసం ఉంటుంది:

        ఈ క్లస్టర్ లో రోగులు తీవ్రమైన ఇన్ఫెక్షన్ తో బాధపడతారు. వారికి రోగనిరోధక శక్తి
తక్కువగా ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid