క్యాన్సర్‌








కీడెంచి మేలెంచమంటారు. ముఖ్యంగా క్యాన్సర్‌ విషయంలో దీన్ని విస్మరించటం తగదు. ఎందుకంటే కొన్ని క్యాన్సర్‌ లక్షణాలు ఇతరత్రా సమస్యల లక్షణాలుగానూ కనబడుతుంటాయి. కాబట్టి వీటికి మూలమేంటో తెలుసుకొని జాగ్రత్త పడటం అవసరం.

నెలసరి నిలిచాక రక్తస్రావం: నెలసరి నిలిచిన తర్వాత ఎప్పుడో అప్పుడు కొద్దిగా ఎరుపు కనబడటం మామూలే. దీనికి పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదు. కానీ హఠాత్తుగా నెలసరి మాదిరిగా రుతుస్రావం అవుతుంటే.. పైగా పదే పదే వస్తుంటే మాత్రం అనుమానించాల్సిందే. ఇది గర్భాశయ క్యాన్సర్‌ తొలి హెచ్చరిక కావొచ్చు. గర్భాశయ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తిస్తే చికిత్స తేలికవుతుంది.

కడుపుబ్బరం: నెలసరి సమయంలో చాలామంది కడుపుబ్బరంగా ఉందని చెబుతుంటారు. ఇది పెద్దగా ఇబ్బంది పెట్టేదేమీ కాదు. అయితే ఆ తర్వాత.. మామూలు రోజుల్లోనూ కడుపుబ్బరం లేదా మలబద్ధకంతో బాధపడుతుంటే నిర్లక్ష్యం తగదు. ఇవి అండాశయ లేదా గర్భాశయ క్యాన్సర్‌ లక్షణాలు కావొచ్చు. ఎందుకంటే అండాశయ క్యాన్సర్‌ బాధితుల్లో చాలామందిలో కడుపుబ్బరం వంటి సాధారణ లక్షణాలూ కనబడుతుంటాయి.

తరచూ జ్వరం: ఎప్పుడో అప్పుడు జ్వరం రావటం, తగ్గిపోవటం మామూలే. అయితే తరచుగా జ్వరం, పులకరం వంటివి కనబడుతుంటే నిర్లక్ష్యం చేయటం తగదు. ఇవి రక్తక్యాన్సర్‌ లక్షణాలు కావొచ్చు. రక్తక్యాన్సర్‌ మూలంగా అస్తవ్యస్త తెల్లరక్తకణాలు పుట్టుకొస్తాయి. ఇవి రోగనిరోధకశక్తిని నిర్వీర్యం చేస్తాయి. అందువల్ల జలుబు వంటి లక్షణాలు, జ్వరం విడవకుండా వేధిస్తుంటే ఒకసారి డాక్టర్‌ను సంప్రదించటం మంచిది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శలభాసనము

Awareness About Cancer

మెనోపాస్/ఆండ్రోపాస్