ఆరోగ్య సూక్తులు





 

* ప్రతినిత్యం సూర్యోదయానికి ముందుగా నిద్రలేవవలెను . రెండు మైళ్లు వరకు నడవవలెను .

* రాత్రి భోజనం అయ్యిన తరువాత ఒక మైలు దూరం నడుచుట చాలా మంచిది .

* రాత్రి భోజనం నిద్రించుటకు మూడు గంటల ముందు చేయుట మంచిది .

* రాత్రి సమయం నందు 10 గంటల లోపు నిద్రించుట చాలా మంచిది .

* ఆహారం ని పూర్తిగా నమిలి మింగవలెను.

* స్నానం చేసిన వెంటనె భోజనం చేయరాదు . అలా చేసినచో జీర్ణశక్తి నశించును. గంట సమయం తరువాతనే
భోజనం చేయవలెను .

* రాత్రి నిలువ ఉన్న వంటలను భుజించరాదు. చద్ది అన్నం భుజించినచో వళ్ళు బరువెక్కును . చురుకు లేకుండా ఉండును.

* దంతధావనం అనంతరం యే వస్తువులు తినకుండా 6 తులసి దళములు నమిలి ప్రతినిత్యం మింగుతూ ఉన్నయెడల జ్వరములు రాకుండా ఉండుటయే కాక జీర్ణశక్తి పెంపొందును.




* వేడి వస్తువులు తీసుకున్న వెంటనె చల్లని నీరు తీసుకోకూడదు.

* అతి కారం గల వస్తువులు , అతిగా మసాలా గల వస్తువులు తీసుకున్నచో కడుపు మరియు పేగులు బలహీనం అగును.

* రాత్రి పడుకునే అరగంట ముందు పాలు తాగవలెను ఉదయం ఎమన్నా తీసుకున్న తరువాత నీటిని తాగవలెను. భోజనం చేసిన పిమ్మట మజ్జిగ తాగవలెను . ఇలా చేయువారికి ఆరోగ్యం బాగా ఉండును.

* బాగా ఆకలి గా ఉన్నప్పుడు నీటిని తాగుట , దాహాంగా ఉన్నప్పుడు అన్నం తినటం వలన కడుపునొప్పి వచ్చును.

* కడుపు ఉబ్బరం గా ఉండి పుల్లటి తేపులు వచ్చుచున్నప్పుడు చల్లటి మంచినీరు తాగవలెను.

* అన్నం తినేముందు గాని , తిన్న తరువాత గాని అల్లం మరియు ఉప్పు తింటూ ఉన్న యెడల జీర్ణశక్తి ఎక్కువ అగును.

* మూసి ఉన్న ఇంట్లో గాని గదిలోకి గాని తలుపు తీసి వెంటనె ప్రవేశించరాదు. తలుపు తీసి అయిదు నిమిషములు దూరముగా ఉండి లొపల ఉన్న గాలి బయటకి వెళ్లిన తరువాత మాత్రమే లొపలికి వెళ్లవలెను .

* నిద్రించే గదిలో చెడు వాయువులను ఉత్పతి చేసేటువంటి వస్తువులు ఉంచరాదు.

* బట్టలు బిగుతుగా కట్టుకోరాదు. వదులుగా ఉండవలెను .

* శిరస్సు చల్లగా ఉంచుకొనుట , పాదములు వెచ్చగా ఉంచుకొనుట ఆరోగ్యవంతులు యొక్క లక్షణం .

* మలమూత్రములు బిగపట్టుకొని ఉండకూడదు వెంటనె విసర్జించవలెను . అలాగే తుమ్ములు మరియు ఆవలింతలు ఆపుకొనకూడదు. లేనిచో భయంకరమయిన వ్యాధులు సంభంవించును.

* సారా మొదలయిన మత్తుపదార్థాలు సేవించరాదు . దానివల్ల ఆకలి చెడిపోయి బుద్ది చెడిపొవును.

* మిక్కిలి ప్రకాశవంతమైన వెలుతురు , మధ్యాన్న సూర్యుడిని చూడరాదు.

* అవసరం లేకుండా కళ్ళజోడు ధరించరాదు. కళ్లు చెడిపొవును.

* చిన్న అక్షరాలు గల పుస్తకాలు రాత్రి యందు చదవరాదు.

* భోజనం చేసిన వెంటనె వ్యాయమం , మైధునం చేయరాదు . ఆరోగ్యం చెడిపొవును

* రాత్రి బ్రహ్మముహూర్తం( 5గం.లకు) లో నిద్ర నుండి మేల్కొనాలి.

* ఉదయం , సాయంసమయం నందు స్నానం చేయాలి.

* మలమూత్ర మార్గాలను , పాదాలను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకోవాలి.



* వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమాలను 15 రోజులకు మూడుసార్లు తీసుకోవాలి.



* భయము లేకుండా దైర్యవంతునిగా ఉండాలి. భయము కలిగితే రోగాలు వస్తాయి.



* శ్రమ చేయుటకు ముందు శరీరానికిి విశ్రాంతి ఇవ్వాలి.

* ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయాలి .

* రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .



* కాలంకాని కాలము నందు ఆహారం
 తీసుకోవడం వలన జఠరాగ్ని చెడుతుంది .ఇదే అల్సర్ గా మారుతుంది.

* అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఒకేరుచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.

* ఆహారం అతిగా తీసుకోవడం వలన గ్యాస్ సమస్య పెరుగుతోంది. 

* విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.

* పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.

*  భోజనం చేసినతరువాత మజ్జిగ ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయును. 


* రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .

* అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .

* వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .

* నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.

* పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .

* ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .

* దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .

* ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .

* ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .

* చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం

* మినుములు అతిగా వాడరాదు.

* వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.


* గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.

* పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.

* దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.

* మలమూత్ర వేగములను ఆపరాదు .



* స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .

* విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.

* గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .

* ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .

* నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును

* నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .

* తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .

* కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.

* ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .

* ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .

* మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .

* అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .

* నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .

* పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .

* స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.

* ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .

* బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .

* నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.

* గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .

* మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .


* సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .

* రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.

* మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .

* స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .

* బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .

* నోటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .

      
     పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను . 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid