అరవైలో కూడా ఇరవై ఏళ్ళ లాగా ఉండాలంటే ఉదయంపూట చేయాల్సిన వ్యాయామాలు
1) 25 గుంజీలు తీయాలి. రోజూ ఈ సంఖ్యను పెంచుకుంటూ పోవాలి.
2) చేతులు పిరుదుల పై పెట్టుకొని వందసార్లు కుడికి, 25సార్లు ఎడమకు వంగాలి.
3) 30 పుష్ అప్స్
4) 25 సార్లు ముందుకు వంగి మళ్ళీ సరిగా నిలబడటం
5) 10 సార్లు చేతులు పైకెత్తడం
6) 20 సార్లు నడుమును కుడికి, ఎడమకు వంచడం
7) కుర్చీ మీద కూర్చుని నేలమీద కాలు పెట్టి కదిలించకుండా 20సార్లు ముందుకు, వెనక్కు
వంగడం.
8) ఒంటి కాలిమీద 20 సార్లు గెంతడం
9) మోచేతుల నుంచి చేతులను 20సార్లు మడచి మళ్ళీ యధాస్థానానికి తేవడం
10) నేలమీద పడుకొని, చేతుల సహాయంతో కాళ్ళు శరీరం పైకెత్తి 20 లెక్క పెట్టేవరకు
ఉండడం.
11) పడుకుని 20 సార్లు రెండు కాళ్ళుమాత్రమే జానెడు ఎత్తు పైకెత్తడం
12) 20 సార్లు నడుం బిగించడంచెమట పట్టి, రొప్పు వచ్చేవరకు ఈ వ్యాయామాలు చేయాలి.
___Dr. Amesov
- (వి. పెకెలిస్ రాసిన “మీ గురించి మీకు తెలుసా” నుండి)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి