ఎవరికయిన fits/seizure వస్తే First aid ఏమి చేయాలి ?



మనం వాడుకభాషలో Seizures ని fits అని అంటాము . తెలుగులో మూర్ఛ వ్యాధి. 
సాధారణం గా fits వస్తే చేతిలో తాళాలు పెట్టడం,తల మీద నుండి నీళ్లు గుమ్మరించడం, నోట్లో metal object పెట్టడం లాంటివి చేయడం జరుగుతుంది. కాని అలా చేయడం వలన fits తగ్గుతాయి లేదా patients కి ఉపశమనం కలుగుతుంది అనేది మూఢనమ్మకం మాత్రమే.
మా బాబు కి గత 18 సంవత్సరాలనుండి రోజూ fits వస్తాయి నేను ఎప్పుడూ చేతిలో తాళాలు పెట్టడం లాంటివి చేయలేదు. 
ఈ క్రింద అమెరికాలోని Center for Disease Control వారు fits వస్తే first aid ఏమి చేయాలి అని చేసిన recommendations రాస్తున్నాను. వీలైతే అందరితో share చేయండి .

1.Fits వచ్చిన వ్యక్తి ని ముందు నేలమీద పడుకోపెట్టాలి తర్వాత ఒక పక్కకు తిప్పాలి.
2.చుట్టుపక్కల ఏమైనా పదునైన వస్తువులు ఉంటే అక్కడ నుండి తీసివేయాలి. Fits వచ్చేటప్పుడు jerks లాగా వస్తాయి కాబట్టి Patient కి  దెబ్బలు తగలవచ్చు. 
3.కళ్ల జోడు ఉంటే అది తొలగించాలి. 
4.తలక్రింద మెత్తని cloth పెట్టాలి(అందుబాటులో ఉన్న వాటిని బట్టి ఏదో ఒక మెత్తని బట్ట) 
5:గాలి ఆడే విధంగా shirt గుండీలు గాని మెడకు బిగువుగా ఉండే ఏమైన వస్త్రాలు ఉంటే వదులు చేయాలి. 
6.Fits ఎంత సేపు వస్తున్నాయో time note చేయాలి . ఒక వేళ fits 5 నిమిషాలు కంటే ఎక్కువ వస్తే ambulance కి call చేయాలి. 
7.Fits వస్తున్న వ్యక్తి ని ఒంటరిగా వదలకూడదు.
8. సాధారణం గా fits వస్తున్న వారికి కొంతమంది నీళ్లు తాగించడం లాంటివి చేస్తారు కాని Fits వచ్చేటప్పుడు ఏదైన తినిపించడం, తాగించడం చాలా ప్రమాదకరం. శ్వాసఆడటానికి ఇబ్బంది అవుతుంది . 

మూర్ఛవ్యాధి ప్రాణాంతకం, అది వచ్చినపుడు ప్రధమ చికిత్స చేయడం వలన మన తోటివారి ప్రాణాలను మనం కాపాడగలం. 
“If someone is having a seizure, step up and do first aid”

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Sleep Is As Important As Exercise & Nutrition

మహా ఓషది(శొంఠి)

Facts on Omega-3 Fatty Acid