పోస్ట్‌లు

2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Omega3 uses

Research shows that consumption of EPA and DHA Omega-3 fatty Acids may reduce the risk of coronary heart diseases. As such the American Heart Association (AHA) recommends the daily dietary intake of Omega-3 essential fatty acids EPA & DHA at1000 mg/day for cardiovascular Health. The support of cognitive function And neurologic by the Omega-3 fatty acids EPA & DHA is supported in multiple research studies. In addition, Omega-3 fatty acids have been shown to support the health of mood Brain/Neurologic and emotion. Health Omega-3 fatty acids, especially EPA, Support joint health in the body. This is due to their impact on lipid membranes, they also promote normal and healthy balance in the body Immune pathways and responses. The Omega-3 fatty acids EPA & DHA Have been found to help & support the macula and retina of the eye. In addition, they support the healthiness & the normal lubrication of ocular structures. When Omega-3 fatty acids are used in combination with a h...

మెగ్నీషియంతినండి.. ఆరోగ్యంగా ఉండండి!

👉మెగ్నీషియం.. ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగకరమైనది. ఇది శరీరంలో అనేక జీవరసాయన ప్రతిచర్యలకు మద్దతు ఇస్తుంది. శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో మెగ్నీషియం లేకపోతే.. కిడ్నీలు తమ వద్ద ఉన్న మెగ్నీషియంను అందించి ఆదుకుంటుంది. ఇది ఇలాగే కొనసాగితే, చివరకు మూత్రపిండాలు చెడిపోతాయి. ఇది మాంసకృత్తుల తయారీ, పిండిపదార్థాల జీవక్రియలో సహకారకంగా పనిచేస్తుంది. తగినంత మెగ్నీషియం తీసుకోవడం మానసిక ఆరోగ్యాన్ని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ఇది అధిక రక్తపోటు వంటి గుండె జబ్బులతో ముడిపడి ఉన్న ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా గుండెను ఆరోగ్యంగా పెంచుతుంది.  👉నేషనల్ హెల్త్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం.. మెగ్నీషియం యొక్క రోజువారీ అవసరం పురుషులకు 400-420 మి.గ్రా, b 350-360 మి.గ్రా. అవసరం. మెగ్నీషియం శరీరానికి శక్తిని ఇస్తుంది. చక్కటి నిద్ర వచ్చేలా చేస్తుంది. బ్లడ్ షుగర్‌ను కంట్రోల్ చేస్తుంది. హార్మోన్స్ సరిగా పనిచేసేందుకు సాయపడుతుంది. మనం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం సరైన పాళ్లలో శరీరానికి అందాలి. మన శరీరంలో వందల కొద్దీ ఎంజైంల పనితీరును మెగ్నీషియం మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట...

సర్వాంగాసనం

చిత్రం

బ్రౌన్ రైస్ ద్వారా 9 ఆరోగ్య ప్రయోజనాలు

చిత్రం
సమయానికి..సరైన ఆహారం తీసుకోక పోవడంతో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇందులో భాగంగానే కొందరు వేలా పాలా లేకుండా ఫుడ్ తీసుకోవడంతో వెయిట్ కూడా పెరుగుతుంటారు. వెట్ సమస్యతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. బరువు తగ్గేందుకు నానా పాట్లు పడుతున్నారు. దీనికి బ్రౌన్ రైస్ తో చెక్ పెట్టవచ్చంటున్నారు నిపుణులు. అంతేకాదు ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయంటున్నారు. బ్రౌన్ రైస్ లో తక్కువ ఫ్యాటెనింగ్ పదార్థాలుంటాయి. 1.డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది: డయాబెటిస్ అనేది సాధారణ మెటబాలిక్ డిజార్డర్. ఈ మధ్యకాలంలో, ఈ డిజార్డర్ కు గురయ్యేవారి సంఖ్య పెరుగుతూ ఉంటోంది. ఇన్సులిన్ అనే హార్మోన్ ని శరీరం తగినంతగా ఉత్పత్తి చేయకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి అమాంతం పెరుగుతాయి. దీంతో.. అనేక అవాంఛిత ప్రభావాలు శరీరంపై పడతాయి. బ్రౌన్ రైస్ అనేది ఫైటిక్ యాసిడ్, ఫైబర్ లనే న్యూట్రియెంట్స్ ని పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ని సమర్థవంతంగా తగ్గించి డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. అందువలన, డయాబెటిస్ వలన కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయి. 2.సిస్టమ్ ని డిటాక్సిఫై చేస్తుంది: అనారోగ్యకరమైన ఆహారాల ద్వారా మన శరీరంలోకి టాక్సిన్స్ ...

హైబీపీ తగ్గాలంటే..

చిత్రం
ప్రపంచంలో అత్యధిక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో హైబీపీ కూడా ఒకటి. ఒత్తిడి, ఆందోళన, గుండె జబ్బులు, మద్యం అధికంగా సేవించడం.. తదితర అనేక కారణాల వల్ల చాలా మందికి హైబీపీ వస్తుంటుంది. అయితే కింద తెలిపిన సహజ సిద్ధమైన పదార్థాలను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా హైబీపీ సమస్య నుంచి బయట పడవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! * దాల్చినచెక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే హైబీపీ తగ్గుతుంది. తేనె, దాల్చినచెక్క పొడిని నిత్యం ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుంటే హైబీపీతోపాటు పీసీవోడీ, డయాబెటిస్ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే అధిక బరువు కూడా తగ్గుతారు. * అవిసె గింజెల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి హైబీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే ఈ గింజల వల్ల ఇతర అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవిసెగింజలను అలాగే తినవచ్చు. లేదా పొడి చేసుకుని మజ్జిగ, ఫ్రూట్ సలాడ్ వంటి వాటిలో కలుపుకుని కూడా తినవచ్చు. * యాలకులను నిత్యం ఆహారంలో భాగం చేసుకోడం ద్వారా హైబీపీకి చెక్ పెట్టవచ్చు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. అలాగే వీటిలో ఉండ...

పశ్చిమోత్తాసనము

నడుముని ముందుకు వంచుతాము ఈ ఆసనములో 1. దండాసనములో కూర్చొవలయును. 2. నడుమ పై భాగాన్ని మెల్లగా ముందుకి వంచుతూ చేతుల్ని మెల్లగా పైకెత్తి క్రిందకి వంచుతూ చేతి వేళ్ళతో కాలి బొటనవేళ్ళని పట్టుకోవలయును. 3. కాలి వేళ్ళను చేతి వేళ్ళతో పట్టుకోవటం కష్టంగా ఉంటే చీలమండల్ని గానీ మడమల్ని గానీ పట్టుకోవలయును. అదీ కష్టంగా ఉంటే కాలిని ఎక్కడ దొరికినా పట్టుకోవటానికి ప్రయత్నించవచ్చును. 4. మెల్లగా మరింత ముందుకి, కాళ్ళని స్క్రయిట్ గా ఉంచుతూ చేతి కండరాల్ని ఉపయోగించి మీ తలని నా మోకాళ్ళని తాకించే ప్రయత్నం చేయవలయును. 5. ఇలా చేసేటప్పుడు ఎక్కువగా శ్రమ పనికిరాదు. ఈ స్థితిలో సౌకర్యం ఉన్నంతవరకూ ఉండవచ్చును. తిరిగి మరల యథా పరిస్థితికి రావలెను. సయాటికా గలవారూ, స్లిప్ డిస్క్ గలవారూ ఈ ఆసనము వేయరాదు. ప్రయోజనములు: తొడ వెనక కండరాలను, హిప్ జాయింట్స్న సడలింప జేయగలదు. ఈ ఆసనం వలన కడుపులోని కండరాలు మసాజ్ యబడును. లివర్ ఫంక్షన్ సరిచేయబడుతుంది. షుగర్ వ్యాధి గ్రస్తులకు మిక్కిలి ఉపయోగకరమయినదిగా భావింపబడుతున్నది.

పాదహస్తాసనము

పాదాలను చేతులతో తాకుతాం ఈ ఆసనములో 1. విశ్రాంతిగా నిల్చుని ఉండాలి. 2. మడమలకు కలిపి ఉంచి, చేతులను, నేలకు సమాంతరంగా పైకెత్తవలయును. 3. ఊపిరి పీల్చుతూ, చేతులు చెవులకు తాకునట్లుగా తల మీదుగా పూర్తిగా పైకి తీసుకుని రావలయును. 4. శరీరము నేలకు సమాంతరంగా ఉండేటట్లుగా ముందుకి వంగవలయును. వంగినప్పుడు, నడుము పూర్తిగా ముందుకు లాగుటకు ప్రయత్నించవలయును. ఊపిరి వదులచూ అరచేతులను పాదముల ప్రక్కగా నేలపై ఉంచి, నుదురు, మోకాళ్లను తాకే వరకు వంగవలయును. ఈ పరిస్థితుల్లో మోకాళ్లను వంచటానికి ప్రయత్నించరాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములతో సుమారు రెండు నిమిషములు ఆ విధంగా ఉండగలగటానికి ప్రయత్నించవలయును. 5. క్రమంగా మెల్లగా యథాస్థితికి రావలయును. నడుము నొప్పి గలవారూ, గుండె జబ్బులున్నవారూ వేయకూడదు ఈ ఆసనం. అలాగే అధిక రక్తపోటు గలవారూ, హెర్నియా గలవారూ వేయకూడదు.

హలాసనము

నాగలి ఆకారంలో ఉంటాము ఈ ఆసనములో 1. చేతులను తలమీదుగా నేలపైకి చాపి వెల్లికిలా పడుకోవాలి. కాళ్ళను తిన్నగా ఉంచి పాదాలను ఒకచోట ఉంచాలి. రెండు కాళ్ళను నెమ్మదిగా తిన్నగా భూమికి 45 డిగ్రీలలో పైకెత్తాలి. కాళ్ళను ఇంకా పైకెత్తి 90 డిగ్రీల వరకూ రానివ్వాలి చేతులను శరీరము ప్రక్కల నుంచవలయును. 2. వీపును కటి ప్రదేశమును చేతుల సహాయముతో పైకెత్తవలయును. మోచేతులను నేలపై ఉంచి, వీపును అరచేతులతో నిలబెట్టవలెను. చేతుల సహకారముతో శరీరమును నడుము వరకు నిలువుగా ఉంచవలయును. చుబుకాన్ని మెడకు దగ్గరగా ఉంచవలయును. కాళ్ళు నేలకి సమాంతరంగా ఉంచవలెను. - 3. ఈసారి కాళ్ళను మెల్లగా తలపై భాగము పైకి దించుతూ నడుముని పట్టుకోవలయును. ప్రయోజనములు: వీపు కండరములు, కీళ్ళు, కటి ప్రదేశము నందలి నరములు సాగుట వలన ఆరోగ్యము చేకూరును. మెడ ప్రాంతములో రక్త ప్రసరణ అధికమగును. థైరాయిడ్ గ్రంథి, వెన్నెముకల సామర్థ్యము పెరగగలదు.

ధనురాసనము

ఎక్కుపెట్టిన ధనస్సులా ఉంటాం ఈ ఆసనంలో 1. మకరాసనంలో విశ్రాంతిగా ఉండవలయును. 2. రెండు కాళ్ళను పాదములను తిన్నగా ఉంచి పొట్ట ఆధారంగా నేల మీద పడుకోవలయును. 3. మోకాళ్ళను వెనుకకు వంచి రెండు పాదములను రెండు చేతులతో పట్టుకోవలయును. 4. వెన్నెముక ధనురాకారములో వంగునట్లుగా తలను, ఛాతీని తొడను పైకెత్తవలయును. శరీరము యొక్క బరువు పొట్టపై ఉంచవలయును. పైకి చూడవలెనే గానీ మోచేతులను వంచరాదు.

వ్యాఘాసనము

ఈ ఆసనంవేసిన పెద్ద పులిలా ఉంటాము. 1. వజ్రాసనంలో కూర్చోవలయును. 2. భుజాలను, అరచేతులను సరిగా క్రిందగా ఉండవలయును. 3. కుడికాలును నిటారుగా ఉంచి, పైకి వెనుయవైపు సాగదీయాలి. 4. కుడి మోకాలు వంచి, కాలి వేళ్ళు తల వెనుక భాగానికి గురి పెట్టి ఉంచవలయును. 5.. తల పైకెత్తి కాలివేళ్ళు తల వెనుక భాగానికి అనేటట్లుగా ఉంచవలయును. ఇది ప్రారంభదశగా భావించాలి.

మార్జాలాసనము

మర్జరీ ఆసనము దీనినే మార్జాలాసనము అని కూడా పేర్కొనవచ్చును. పిల్లి ఆకారములో ఉంటుంది. కాబట్టి దీనికా పేరు. 1. వజ్రాసనములో కూర్చోవలయును. 2. పిరుదులను పైకెత్తి మోకాళ్ళపై నుంచుని అరచేతులను నేలపై ఉంచవలయును. 3. మోకాళ్ళని కొద్దిగా ఎడం చేయవలయును. 4. మోకాళ్ళతో సరిసమానంగా చేతుల మధ్య గ్యాప్ ఉంచవలయును. • 5.దీనిని ప్రారంభ దశగా భావించవలయును. 6.తలపైకెత్తి నెమ్మదిగా శ్వాసపీలుస్తూ వెన్నెముకనూ లోపలివైపుగా అణుస్తూ వీపును పల్లం చేయవలయును. 7. తలను నెమ్మదిగా క్రిందకి వాల్చి వెన్నెముకను పైకి వచ్చేలా ఉపిరి వదలవలయును. ఉపిరి వదిలే ఆఖరు సమయంలో పొట్టను సంకోచింపజేస్తూ తొడలకు అభిముఖంగా రెండు చేతుల మధ్య తలను ఉంచి పొట్టని సంకోచింపజేయవలయును. క్రమం తప్పకుండా నిత్యము 5 నుంచి 10 సార్లు చేయవచ్చును. వెన్నెముకపై నుండి క్రిందకి క్రమంగా వంగినప్పుడు శ్వాస, శరీర కదలికలు ఒకదానిలో ఒకటి సింక్రనైజ్ కావలయును. ప్రయోజనములు: భుజములు, మెడభాగము, వెన్నెముకలలో సాగే తత్వాన్ని ఆసనం వలన పెంపొందించుకోగలం. స్త్రీలకు వునరుత్పత్తి క్రమముగా మృదువుగా క్రమబద్ధీకరించగలదు. గర్భవతులైన స్త్రీలు ఈ ఆసనము ఆరోమాసం వరకు చేయవచ్చును. స్త్రీలలో ఋతుసావక సమయాలలో కల...

శలభాసనము

మిడత ఆకారంలో ఉంటాం ఈ ఆసనములో 1. మకరాసనములో విశ్రాంతిగా ఉండవలయును. 2. చేతి బొటన వేలు రెండింటిని లోపలుంచి, చేతి పిడికిళ్ళు మూసి పొతి ఊతకడుపు క్రింద ఉంచవలయును. 3. ఊపిరిని క్రమంగా పీల్చి, మోకాళ్ళను వంచకుండా కాళ్ళను నడుమభాగము నుంచి ఒకే మారు పైకెత్తవలయును. 4. కొంచెం సేపు అలానే ఉండి, నెమ్మదిగా కాళ్ళను క్రిందికి దింపవలయును. శలభాసనము వేయుటకు శ్రమ అధికం- అధిక రక్తపోటు గలవారు, గుండె బలహీనముగా ఉండినటువంటి వారు పెస్టిక్ అల్సర్, హెర్నియా వ్యాధి గలవారు ఈ ఆసనములు వేయరాదు. ప్రయోజనములు: వీపు వెనుక క్రింది భాగములు, పెల్విన్ కండరాలు, సయాటిక్ నరాలను ఉత్తేజ పరచగలదీ ఆసనము. కాలేయం, ఉదర సంబంధ అంగాలను సక్రమంగా పనిచేయుటకు సహాయపడటమేగాక ఉదర సంబంధ వ్యాధులను నివారించగలదు.

అర్థ శలభాసనము

మిడత ఆకారములో సగం మాత్రమే ఉంటాం. ఈ ఆసనంలో 1. మకరాసనములో విశ్రాంతిగా ఉండవలయును. 2. పిడికిళ్ళు బిగించి, తొడల క్రిందకు పొత్తికడుపు క్రిందుగా మోకాళ్ళను వంచకుండా కాళ్ళను నడుము భాగము నుంచి పైకి ఎత్తవలయును. 3. నడుము కండరాలను ఉపయోగించి ఎడమకాలు వీలయినంతవరకు ఎత్తుకు ఎత్తవలయును. రెండకాలు తిన్నగా నేలకు ఆనించి ఉంచవలయును. 4. క్రమక్రమంగా ఎడమకాలిని యథాస్థితికి తీసుకురావలయును. 5. పై ప్రకారంగా కుడికాలితో కూడా సాధన చేయవలయును. పై ప్రకారంగా 10 సెకన్లు నుండి 30 సెకన్ల వరకు చేయవచును. పై విధముగా 5 లేక 6 సార్లు సాధన చేయవలయును. ప్రయోజనాలు: తుంటి, కటి ప్రదేశములందలి కండరరములను శక్తివంతం చేసి సయాటి కాలను నివారించడంలోనేగాక మలబద్ధకము తగ్గించగలదు. మూత్రపిండ ములు ఈ ఆసనము వేయటం వలన చైతన్యవంతమవుతాయి.

Sciatica

చిత్రం
Sciatic nerve Open pop-up dialog box Sciatica refers to pain that radiates along the path of the sciatic nerve, which branches from your lower back through your hips and buttocks and down each leg. Typically, sciatica affects only one side of your body. Sciatica most commonly occurs when a herniated disk, bone spur on the spine or narrowing of the spine (spinal stenosis) compresses part of the nerve. This causes inflammation, pain and often some numbness in the affected leg. Although the pain associated with sciatica can be severe, most cases resolve with non-operative treatments in a few weeks. People who have severe sciatica that's associated with significant leg weakness or bowel or bladder changes might be candidates for surgery. Symptoms Pain that radiates from your lower (lumbar) spine to your buttock and down the back of your leg is the hallmark of sciatica. You might feel the discomfort almost anywhere along the nerve pathway, but it's especially likely to follow a path...

Omega-3 Foods to Boost Mood, Brighten Skin, Fight Inflammation

చిత్రం
Omega-3 or fish oil is  the second most common supplement  taken on a daily basis after multivitamins among those who take supplements in the US. But if you don't want to take fish oil for any reason (you don't eat fish or you don't like to have that much oil in your diet) there are other ways to get your Omega-3 needs met, including whole foods that are high in Omega-3 such as seeds, nuts, and beans. Here are exactly what foods to add for Omega-3. Since the body can't produce these fatty acids on its own, these essential fats must come from the food you eat. They offer unique health benefits, including boosting mood, brightening dull skin and fighting inflammation. Specifically, Omega-3s have been shown in studies to lower blood pressure,  regulate heart rate, improve blood vessel function among others. Omega-3s are also important in regulating brain function and help boost your mood, so if you are feeling a little distracted or down, it may be...

మజ్జిగతో ఎన్ని ఉపయోగాలో....

మజ్జిగ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.  ఎండాకాలం వస్తే చల్లదనం కోసం మజ్జిగ తీసుకుంటూ ఉంటారు.  ఒక్క ఎండాకాలం మాత్రమే కాదు, అన్ని కాలాల్లో మజ్జిగను తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.  మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకుంటే అది శరీరానికి ఎనర్జీ డ్రింక్ లా పనిచేస్తుంది. మజ్జిగ శరీరాన్ని కూల్ చేయడమే కాదు, శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది.  దానితో పాటుగా శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది.  మజ్జిగ లో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది.  ఇది ఇతర పాల ఉత్పత్తుల కంటే చాలా సులువుగా జీర్ణం అవుతుంది.  మజ్జిగ గ్యాస్, అజీర్తి వంటి వ్యాధుల నుంచి బయటపడేలా చేస్తుంది.  అంతేకాదు, మజ్జిగలో క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్ డి  ఉంటాయి.  ఎముకలు పటిష్టంగా ఉండేందుకు ఎంతగానో తోడ్పతాయి.  

చెడు కొలెస్ట్రాల్ నివారించ‌డానికి 5 మార్గాలు

చిత్రం
కొలెస్ట్రాల్ రెండు ర‌కాలు ఉంటాయి.  అది మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌.  అయితే సాధార‌ణంగా అంద‌రూ కొలెస్ట్రాల్ అన‌గానే చెడు కొలెస్ట్రాల్ అనే అనుకుంటారు. ఏదేమైనా శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే ఎన్నో అన‌ర్థాల‌కు దారి తీస్తుంది. ఇది శ‌రీర భాగాల‌కు ర‌వాణా చేస్తాయి. ర‌క్త‌ప్ర‌వాహంలో ఎల్‌డిఎల్ అధికంగా ఉంటే ఈ కణాలు ధమనులలో ఎల్‌డిఎల్‌ను డంప్ చేస్తాయి. దీనివల్ల గుండెపోటు కూడా వస్తుంది. చాలామంది ఎల్‌డిఎల్‌ను చెడు కొలెస్ట్రాల్‌గా సూచిస్తారు. ఈ చెడు కొలెస్ట్రాల్‌ను తీసుకునే ఆహారంతోనే నివారించ‌వ‌చ్చు. మ‌రి ఆ ఆహార ప‌దార్థాలు, ఆ ఐదు మార్గాలేంటో తెలుసుకోండి.  వోట్మీల్‌, వోట్‌బ్రాన్, హై-ఫైబర్ ఫుడ్స్ : వోట్మీల్‌లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. 5-10 గ్రాముల కరిగే ఫైబర్ మాత్రమే కలిగి ఉండటం వలన ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చు. కావాల్సిన ఫైబ‌ర్‌ను పొంద‌డానికి ఒక‌టిన్న‌ర క‌ప్పు వండిన వోట్మీల్ తింటే స‌రిపోతుంది.  చేపలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు : ఒమేగా -3లు అధికంగా ఉండే చేప‌ల‌ను తిన‌డం వ‌ల్ల కొలెస్ట్రాల్‌ను త‌గ్గించేందుకు స‌హాయ‌...

కొబ్బరితో ఉపయోగాలు

నువ్వు  నక్షత్రాలను  లెక్కపెట్టగలిగితే,  కొబ్బరితో  కలిగే  ప్రయోజనాలను  కూడా  లెక్కపెట్టగలవు -  ఫిలిప్పీన్స్  నానుడి. కొబ్బరి చెట్టులో ఏ భాగమూ నిరుపయోగంగా ఉండదు. కొబ్బరితో అనేక రకాల ఆహారాన్ని తయారు చేస్తారు. దక్షిణాది రాష్ట్రమైన కేరళలో కొబ్బరి లేని వంటలు అరుదుగా కనిపిస్తాయి. అక్కడ వంటకు కూడా కొబ్బరి నూనెనే వాడతారు. అలాగే, కొబ్బరి విరివిగా పండే ఆంధ్రప్రదేశ్ లోని కోన సీమ ప్రాంతంలో, తమిళనాడులో కొబ్బరి ఆహారంలో ఎక్కువగా చోటు చేసుకుంటుంది. ఇటీవల కాలంలో కొబ్బరితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బాగా ప్రాముఖ్యం పొందినట్లు రిమిడియల్ థెరపిస్ట్ , గుడ్ ఫుడ్, ఎ గైడ్ టు హెల్తి కుకింగ్ అండ్ ఈటింగ్ పుస్తక రచయత సీత ఆనంద్ బీబీసీ న్యూస్ తెలుగుకి చెప్పారు. కొబ్బరితో ఆహారంలో ఎన్ని రకాలుగా వాడవాచ్చో వివరించారు. సంప్రదాయ పద్ధతిలో తీసిన కొబ్బరి పాలను డైరీ ఉత్పత్తులకు బదులుగా వాడవచ్చు. కొబ్బరి పాలను వాడి సూప్లు, కేకులు, మిఠాయిలు, పాయసం తయారు చేస్తారు. కొబ్బరిని వివిధ రకాల ఆహార పదార్ధాలలో, కూరలలో, వేపుళ్లలో వాడతారు. దీనితో అన్నం కూడా వండుతారు. ఎండు కొబ్బరిని డ్రై ఫ్రూట్ గా వా...

సర్పాసనం

చిత్రం
        పడగవిప్పిన త్రాచు పామువలె ఉంటుందీ ఆసనం. ఆసనం వేసే విధానం: 1. మకరాసనంలో విశ్రాంతిగా ఉండాలి. 2. పొట్ట ఆధారంగా రెండు కాళ్ళను చాచి పెట్టి రెండు పాదాలు దగ్గరగా ఉంచి నేలపై పడుకోవాలి. 3. చేతి వ్రేళ్ళను బంధించి రెండుచేతులు పిరుదులపైకి వచ్చేటట్లు గడ్డాన్ని నేలకు అనివ్వాలి. 4. నడుము కండరాలను ఉపయోగించి ఛాతీని వీలయినంత పైకి లేపాలి. వెనక పెట్టిన చేతులను వీలయినంత పైకి ఎత్తాలి. 5. శరీరాన్ని వీలయినంత ఎత్తుకు ఎత్తాలి. 6. చేతులను నెమ్మదిగా వెనుకనుంచి తొలగిస్తూ శరీరాన్ని యథాస్థితికి తీసుకురావాలి. గమనిక: అధిక రక్తపోటు గలవారు, హృదయసంబంధ వ్యాధులున్నవారు ఈ ఆసనాలు గురువు పర్యవేక్షణలో వేయాలి. ప్రయోజనాలు: ఆస్త్మా వ్యాధిగ్రస్తులకు ఈ ఆసనము వల్ల మంచి ఫలితాలుంటాయి.

భుజంగాసనము

చిత్రం
           పడగ విప్పిన పాము వలె ఉంటుందీ ఆసనం.అందువల్లే భుజంగాసనం అన్నారు. 1. మకరాసనములో విశ్రాంతిగా ఉండాలి. 2. మడమలను బొటన వేళ్ళను కలిపి బోర్లాపడుకోవాలి. 3. గడ్డాన్ని నేలకు ఆనించాలి. 4. అరికాళ్ళు పై వైపునకు తిరిగి ఉండాలి 5. మోచేతులను వంచి అరచేతులను ఆఖరి ప్రక్కటెముక ప్రక్కన ఉంచాలి.మోచేతుల  ను దగ్గరగా ఉంచాలి. చేతులపై ఎక్కువ బలము పెట్టరాదు. 6.  తల పైకెత్తుచూ  పాము పడగెత్తినట్లు శరీరము నెమ్మదిగా పైకెత్తాలి. నాభిస్థానము నేలను తాకి తాకనట్లుండాలి. 7. మరలా తిరిగి మకరాసనములోకి వచ్చేయాలి. గమనిక:  హెర్నియా, పెప్టిక్ అల్సర్ గలవారు ఈ ఆసనము వేయరాదు. ప్రయోజనాలు: వెన్నెముక  స్ప్రింగులాగా తయారవుతుంది. వీపు నొప్పి వుంటే తగ్గిపోతుంది.  ఉబ్బసం ఉంటే తగ్గుతుంది.  మూత్రపిండాల పై భాగాన ఉండే ఎడ్రినల్ గ్రంథులు చురుగ్గా పనిచేయటానికి సహకరించగల థైరాయిడ్ గ్రంథులను ఉత్తేజపరుస్తుంది.

మకరాసనము

చిత్రం
          శరీరం మకరం లేదా మొసలిని పోలి ఉండటం వల్ల దీనికి మకరాసనమన్నారు. 1.కాళ్ళు చాపి, బోర్లా పడుకొని చేతులపై చెంప ఆనించాలి. 2.కాలి మడమలు లోపలివైపు, వేళ్ళు బయటివైపు ఉంచాలి. 3.ఉచ్చ్వాస, నిచ్చ్వాసలు మెల్లగా తీసుకోవాలి. ప్రయోజనాలు: బోర్లా పడుకుని వేసే ఆసనాల మధ్య మధ్య విశ్రాంతి తీసుకోవడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. వెన్నెముకకు, పొట్ట కండరాలకు, మిగతా అవయవాలకు విశ్రాంతిని కలుగజేస్తుంది. నిద్రలేమి, రక్తపోటు వంటి వ్యాధులనుండి విముక్తి కలిగిస్తుంది

త్రికోణాసనం

చిత్రం
      కాళ్ళ మధ్యలో ఒక కోణం - వీపుకి రెండు చేతుల మధ్య రెండు కోణాలు టోటల్ గా మూడు కోణాలు కలిగిందీ ఆసనం. 1.స్థిరంగా నిలబడాలి. 2. కాళ్ళను వీలయినంత దూరంగా ఉంచాలి. 3. చేతులు మెల్లగా ప్రక్కల నుంచి పైకెత్తి భుజాల వరకూ తీసుకుని రావాలి. 4. గాలిని మెల్లగా వదులుతూ ముందుకు వంగాలి. 5. నడుముని మెల్లగా ఎడమ వైపుకి తిప్పుతూ కుడిచేతితో ఎడమపాదాన్ని పట్టుకోవాలి. 6. ఎడమ చేతిని మెల్లగా పైకిలేపి, తిన్నగా ఉంచాలి. ఇలా చేసేటప్పుడు రెండు చేతులు, ఒకే లైనుగా ఉండాలి. 7. మెల్లగా మెడని పైకి ఎత్తి ఎడమ చేతి వైపు త్రిప్పి ఎడమ చేతిని చూస్తూ ఉండాలి. 8. ఇదేవిధంగా కొన్ని సెకన్ల వరకూ ఉండాలి. 9. తిరగి మనం యథాస్థితికి రావాలి. 10. కొంత సేపు రిలాక్స్ గా ఉండి ఎడమచేతితో కుడిపాదాన్ని తాకాలి.        ఈ విధంగా 5 సార్లు చేయడం మంచిది. ప్రయోజనాలు: శరీరం మొత్తం టోనప్ అవుతుంది.  ఈ ఆసనం వేస్తే కాళ్ళ కండరాలు స్ట్రెచ్ అవుతాయి. జీర్ణవ్యవస్థపై మంచి ప్రభావాన్ని చూపిస్తుంది.

పార్శ్వ తాడాసనం

చిత్రం
     ‌‌ఒంగిన తాడిచెట్టు వలె ఉంటుందీ ఆసనంలో 1. కాళ్ళని రెండింటినీ రెండు అడుగుల దూరంలో ఉంచి నిలబడాలి. 2. చేతి వేళ్ళను ఒకదానితో ఒకటి బంధించి అరచేతులు బయటకు వుండేలా చూడాలి. 3. శ్వాస పీలుస్తూ రెండు చేతులను తలపైకి తీసుకురావాలి. 4. శ్వాసవిడుస్తూ కటి భాగము నుండి ఎడమప్రక్కకి మెల్లగా నడుము వంచాలి. 5. కొంతసేపు అలానే ఉండాలి. నెమ్మదిగా శ్వాస పీలుస్తూ యథాస్థితికి రావాలి. 6. అదే ప్రకారంగా కుడివైపున కూడా చేయాలి. ఈ ప్రకారంగా 5 నుండి 10 సార్లు చేయడం మంచిది. ప్రయోజనాలు: మీ నడుము, వీపు, పొట్ట, కటి భాగాలకు వ్యాయామం కలుగుతుంది. నడుము నొప్పి (స్టిఫ్సస్) గలవారికి ఉత్తమమైన ఆసనం. ఎక్కువ కాలము కుర్చీలో ఉండి పనిచేసేవారికి ప్రయోజనకరమైందీ ఆసనం.  ఈ ఆసనం ఆఫీసులో ఉన్నప్పుడు కండరాల రిలాక్సేషన్ కొరకు వేయవచ్చు.

తాడాసనము

చిత్రం
                         తాడిచెట్టు ఆకారంలో ఉండే ఆసనం కాబట్టి తాడాసనం అని అంటారు.ఇది బాడీ స్ట్రెచింగ్ లాంటిది. 1. పాదాలను 10 సెం.మీ. ఎడంగా పెట్టి శరీరానికి రెండువైపులా రెండు చేతులను పెట్టి నుంచుని ఉండాలి. 2. బరువును రెండు పాదాలపై సమంగా ఉండేటట్లుగా చూడాలి. 3. చేతులను రెండుచేతి వేళ్ళను ఒకదానితో ఒకటి బంధించి పైకెత్తాలి. 4. ఒక బిందువు వద్ద కేంద్రీకరించి సాధన చేసేవరకు అలాగే ఉంచాలి. 5. ఊపిరిని బాగా పీల్చి చేతులను సాగదీసి భుజాలను ఛాతీని పైకెత్తాలి. 6. కాలివేళ్ళ మీద నుంచుని మడమల నెత్తాలి. 7. బాలెన్స్ ఏ మాత్రము తప్పకుండా శరీరము మొత్తం  పై నుండి క్రింద వరకు సాగదీయాలి. కొన్ని సెకన్ల కాలము అదే స్థితిలో ఉండాలి. నిశ్వాసించేటప్పుడు మడమలను కిందకి ఆన్చాలి. 8. కొన్ని సెకన్ల రిలాక్సయిన తరువాత మళ్లీ 5 నుండి 10 సార్లు చేయడం మంచిది. ప్రయోజనాలు: శారీరక మానసిక సమతుల్యత ఏర్పడుతుంది.  వెన్నెముక ప్రాంతంలో నరాలకు పటుత్వం కలుగుతుంది. ప్రేవులు, కండరాలు,పొట్ట సాగేటట్లు చేస్తుంది. గర్భము ధరించిన స్త్రీలు మొదటి ఆరు మాసముల వరకు ...

నిలబడి వేసే ఆసనాలు

                 1. వీపు వెనుకభాగము, భుజములు, కాలి యొక్క కండరాలు చక్కగా సాగి, శక్తి కలిగి ఉండటానికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి. 2. ఎక్కువగా కూర్చుని పనిచేసేవారికి, వీపు నొప్పి కలవారికి ఈ ఆసనాలు ఉపయోగపడతాయి 3. ధ్యానం చేసే సమయంలో వీపు తిన్నగా ఉంచటానికి అవసరమయ్యే కండరాలను శక్తివంతం చేయటానికీ, ఊపిరితిత్తుల సామర్థ్యము పెంచి ప్రాణవాయువును ఎక్కువగా నిల్వచేయటానికి ఈ ఆసనాలు ఎంతో శ్రేయస్కరం. 4. తుంటి నొప్పిగలవారు, ఈ నిలబడివేసే ఆసనాలు  గురువుల పర్యవేక్షణలోనే చేయాలి.

గర్భవతులు - పోషకాహారం

గర్భస్థ సమయంలో ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు : భారతదేశంలో, ముఖ్యంగా దారిద్య రేఖకు దిగువన ఉన్న జనాభాలో స్త్రీ గర్భవతిగా లేని సమయం లోను, గర్భవతిగా ఉన్న సమయంలోను, ఒకే విధమైన ఆహారం తీసుకుంటున్నట్లు లెక్కల్లో తేలింది.బిడ్డకు, తల్లికి ఇద్దరికీ సరిపడా లేక ఎక్కువ ఆహారం తీసుకోవలసిన - అవసరం చాలా ఉంది. తక్కువ ఆహారంతో నష్టాలు  1. గర్భవతి తీసుకోవలసిన దానికంటే తక్కువ ఆహారం తీసుకోవటం వలన, తక్కువ బరువుతో శిశువు జన్మించడం - ఇది - తల్లీ/బిడ్డల మరణాలకు దారితీయటం ఎక్కువగా కనిపిస్తుంది. 2. శిశువు బరువు వృద్ధి చెందడంలోను, తల్లికి కూడా కొవ్వు శరీరంలో పెరిగేటందుకు అదనపు ఆహారం చాలా దోహద పడుతుంది. 3. పాలిచ్చే తల్లులు (బాలింతలు) సంపూర్ణ ఆహారం తీసుకుంటే, శిశువుకు కావలసినంతగా పాలు వచ్చే అవకాశం ఉంటుంది. గర్భవతికి కావలసిన ఆహారం  1. గర్భవతి తీసుకొనే ఆహారం పుట్టబోయే బిడ్డ బరువు పై ప్రభావం చూపుతుంది. 2. గర్భవతికి 300 కాలరీల శక్తి  అదనంగా 15 గ్రా మాంసకృత్తులు/10గ్రా కొవ్వుపదార్ధాలు అయిదారు నెలల గర్భధారణ నుండి తీసుకోవలసిన అవసరం  ఉంటుంది. గర్భవతులు, బాలింతులు తీసుకొనే ఆహారంలో, అధనపు కాల్షియం ఉండాలి. శి...

స్థూల కాయం మరియు పోషణ

         శరీరంలో కొవ్వు అధికంగా చేరడం వల్ల ఏర్పడే పరిస్థితిని స్థూలకాయం అంటారు, వాంఛనీయమైన లేదా ఉండవలసిన దానికన్న 20 శాతం ఎక్కువగా శరీరం బరువు గల వారిని స్థూలకాయులు అనవచ్చు.           స్థూలకాయం ఆరోగ్యపరమైన ఎన్నో దుష్ఫలితాలను కలిగిస్తుంది. అకాల మరణానికి దారితీయవచ్చు. అధిక రక్త పీడనం, రక్తంలో ఎక్కువగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లు చేరడం, గుండెజబ్బు,మధుమేహం,పిత్తాశయంలో రాళ్లు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదాలు స్థూలకాయం వల్ల ఎక్కువవుతాయి. కారణాలు :           అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం,   శారీరకంగా   తక్కువగా   శ్రమపడటం స్టులకాయానికి దారితీస్తుంది.        తాము ఆహారం ద్వారా తీసుకొనే శక్తికి, వివిధ పనుల ద్వారా ఖర్చు పెట్టే శక్తికి మధ్య సమతుల్యం లేనప్పుడు స్థూలకాయం లేదా అధిక బరువు ఏర్పడుతుంది.         ఆహారంలో కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవటం వల్ల కూడా స్థూలకాయం వస్తుంది. వ్యక్తి సంక్లిష్టమైన నడవడిక, మానసిక పరిస్థితి కూడా అతను అధికంగా ఆహ...

కొవ్వుపదార్ధాలు - మన ఆరోగ్యం

       కొవ్వు సంబంధ ఆహారం నుండి, మన శరీరానికి కొవ్వు అందుతుంది. ఇవి చాలా రకాలుగా శరీరానికి ఉపయోగపడతాయి. ఇది శక్తివంతమైన, శరీరానికి ఇంధనము ఇచ్చే పదార్ధం 1 gram కొవ్వు - 9 cal ఇంధనం శరీరానికి అందిస్తుంది.A, B, E &K  విటమినులు, రక్తంలో కొవ్వు పదార్థం ఇమడడానికి చాలా అవసరం. కొవ్వు అనేది - ఆహారంలో, చెట్ల నుండి జంతువుల నుండి లభిస్తుంది.veg-ఆయిల్-మనము తీసుకొనే ఆహారంలో చాలా ముఖ్యమైనది. దీనిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు 1. ఆన్ సాచ్యురేటడ్ (మొనో ఆన్ సాచ్యురేటడ్) 2. పాలీ అన్ సాచ్యురేటడ్ అన్ సాచ్యురేటడ్ కొవ్వు ఆమ్లాలు,ఉదా: వెజిటబుల్ oils సాచ్యురేటడ్ కొవ్వు, ఉదా:  వెన్న, నెయ్యి          పెద్దవయస్సువారు - కొవ్వుపదార్ధాలు ఉండే, వెన్న, నెయ్యి హైడ్రోజినేటెడ్ కొవ్వుపదార్ధాలు చాలా తక్కువగా తీసుకోవాలి. కొబ్బరినూనె వాడరాదు. హైడ్రోజినేటడ్ కొవ్వు తీసుకొంటే రక్తంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా గుండెకు, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు గురవుతారు. వంటలకు వాడే నూనెలు, వెజిటబుల్ నూనె, వనస్పతి, నెయ్యి, వెన్నలలో కొవ్వు ఉంటుంది. ప్రతిరోజు ఆహారంలో యుక్త వయస్సు...

శారీరక పెరుగుదల__ శక్తి

    భారత దేశ జనాభాలో ఐదో వంతు కౌమార వయస్సు వారే. ఈ దశలో వారి శారీరక పెరుగుదల వేగంగా ఉంటుంది.            కౌమార దశలో పెరుగుదలను వేగవంతం చేయడానికి పోషకాహారం చాలా కీలకమైనది. మన దేశంలోని బాలికల్లో యుక్తవయస్సు రాకుండా జాప్యం జరగడానికి పోషకాహార లోపాన్ని ఒక కారణంగా చెప్పొచ్చు.           అమ్మాయి శరీర బరువు పది శాతం కొవ్వుతో 30 కిలోలకు చేరుకున్నప్పుడే యుక్తప్రాయంలోకి ప్రవేశించి శారీరక ఎదుగుదలను సాధించగలరు.     అందుకే కౌమార దశ వయస్కులకు మాంసకృత్తులు, ఖనిజాలు, విటమిన్లు, శక్తిని ఇచ్చే ఆహార పదార్ధాలు ఎక్కువ అవసరం. మనకు శక్తి ఎందుకు అవసరం? మనుషులు తమ పనులు చేసుకోవటానికి తగినంత శక్తి కలిగి ఉండటం అవసరం, శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచటానికి, జీర్ణక్రియలకు, పెరుగుదలకు కూడా శక్తి అవసరం. జాతీయ పోషకాహార పర్యవేక్షక బృందం (NNMB) జరిపిన ఒక సర్వే ప్రకారం, మన దేశంలో 50శాతం మంది మహిళలు, పురుషులు శక్తిహీనతతో బాధ పడుతున్నారు.            ఆహారంలో లభించే కాలరీలు, పౌష్టికాహార పరిభాషలో ఆహారం ద్వారా లభించే శక్తిని...

ఖనిజ లవణాలు (మినరల్స్)

చిత్రం
           దేహానికి అవసరమైన ఖనిజలవణాలు పుష్కలంగా ఉండేది ఆకుకూరల్లోనే. ఎందుకంటే స్తున్నం, భాస్వరం, ఉప్పు, ఇనుము తదితర ఖనిజలవణాలను సరాసరి స్వీకరించి, జీర్ణించుకునే శక్తి మనకు లేదు. ప్రకృతి ఆ శక్తిని వృక్షాలు, మొక్కలకు ఇచ్చింది. ఖనిజ లవణాలను అవి స్వీకరించి, సేంద్రియ లవణాల రూపంలో కాండా లలోను, ఆకులలోను, కాయలలోను, పండ్లలోను, పూలు, దుంపలతోను పదిలపరచుకుంటాయి. వాటిని మనం ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.         ఆకుకూరలలో ఇనుము విశేషంగా ఉంటుంది. ఎ,బి,సి,డి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. అందువలన ఆకుకూరలను దేహ రక్షక పదార్ధాలుగా పరిగణిస్తుంటారు. ఆకుకూరలలో గల మాంసకృత్తులు పదార్థము సులభంగా జీర్ణమై, త్వరగా శరీర కణాలలో కలిసిపోవు స్వభావాన్ని కలిగి ఉంటుంది. ప్రతిమనిషికి సగటున రోజుకు 120 గ్రాముల  ఆకుకూరలను ఆహారంగా తీసుకోవాలని  వైద్యులు అంటున్నారు. ప్రయోజనాలు         బలవర్ధకమైన ఆహారం కావలసిన వారికి ఆకుకూరలు సహాయపడతాయి. • వ్యా ధి ఉధృతిని తగ్గించటానికి, తిండి ఎక్కువై వ్యాధులు వచ్చిన వారికి ఆకుకూరలు సహాయపడతా...

పిండిపదార్థాలు(కార్బోహైడ్రేట్స్)

చిత్రం
               పిండి పదార్థాలను ఆంగ్లంలో కార్బోహైడ్రేట్లు అంటారు. నిజానికి పిండి పదార్థం - అంటే starchy substance - ఒక రకం కర్బనోదకం. పిండి పదార్ధాలు, చక్కెరలు, పిప్పి పదార్ధాలు, మొదలైనవన్నీ కర్బనోదకాలకి ఉదాహరణలే. కార్బోహైడ్రేట్లు అంటే కార్బన్ యొక్క హైడ్రేట్లు అని అర్థం. కార్బోహైడ్రేట్లు అనే పేరు వల్ల ఇవి కార్బన్, నీరు (హైడ్రేట్) సంయోగ పదార్థాలనే అర్థం వస్తుంది. కార్బోహైడ్రేట్లను శాకరైడులు అని కూడా పిలుస్తారు.  గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ (చక్కెర), లాక్టోజ్, సెల్యులోజ్, స్టార్చ్ (పిండి పదార్థం) కార్బోహైడ్రేట్లకు కొన్ని ఉదాహరణలు. వీటిని పిండి పదార్థాలు (బియ్యం, పప్పు ధాన్యాలు, ఆలుగడ్డలు, రొట్టె) లేదా చక్కెరలు (పటిక బెల్లం, జామ్, స్వీట్స్ లాంటివి) రూపంలో మనం ఆహారంగా తీసుకుంటాం.   పంచదారకీ, పిండికీ బాహ్య లక్షణాలలో తేడాలు ఉన్నప్పటికీ వాటి రెండింటిలోనూ మూడే మూడు మూలకాలు దాదాపు ఒకే నిష్పత్తిలో ఉన్నాయని గే-లుసాక్‌ కనుగొన్నారు: 45 శాతం కర్బనం (carbon), 6 శాతం ఉదజని (hydrogen), 49 శాతం ఆమ్లజని (oxygen). అంటే ఒక పాలు ఉదజనికి సుమ...

పౌష్టికాహారం

చిత్రం
పౌష్టికాహారం ఏ ఆహారం మనం తీసుకుంటే మన ఆరోగ్యం బాగుండేటట్లు చేసి,అనారోగ్యపాలుకాకుండా శక్తివంతంగా ఉంచి జీవనపరిమాణం మెరుగయ్యేటట్లు చేస్తుందో దానినే పౌష్టికాహారం అంటారు .          పౌష్టికాహారములో ముఖ్యంగా 7 రకాలైన పోషకాలు ఉండాలి.అవి 1. మాంసకృత్తులు (proteins) . 2. పిండిపదార్ధాలు(carbohydrates) . 3. కొవ్వుపదార్థాలు (fats), 4. పీచుపదార్థము (fiber), 5. విటమిన్లు (vitamins), 6. ఖనిజలవణాలు(minerals) . 7. నీరు(water) .         ఆహారం తీసుకోవడంలో సమతుల్యత, వైవిధ్యం, పరిమితంగా ఉండగలగడం అనేవి, ఆరోగ్యంగా ఆహారం తీసుకునే పద్ధతులని వైద్యులు చిరకాలంగా చెబుతున్నారు. అంటే, శృతిమించిన స్థాయిలో కేలరీలు లేదా ఒకే తరహా పోషకాన్ని అతిగా తీసుకోకుండా.... వైవిధ్య భరితం అయిన ఆహారాన్ని తీసుకోవాలనేది వారి సలహా.         ఆహారాన్ని శరీర పోషణకు తీసుకోవాలి.అంతేగాని రుచిగా ఉందనో,ఆకలిగా ఉందనో ఎక్కువగా తీసుకోరాదు. అందువల్ల తగిన ఆహారాన్ని వివేకంతో ఎన్నుకొని తీసుకోవాలి.           మహిళలు గర్భంతో ఉన్నప్పుడు, తల్లి బిడ్డకు పాలిస్తున్నప్పుడు...

మాంసకృత్తులు ఎంత తీసుకోవాలి?

చిత్రం
    మాంసకృత్తులు       మాంసకృత్తులు (ప్రోటీన్స్) శరీర అవయవాల నిర్మాణ కార్యక్రమాన్ని శక్తిని వినియోగించుటకు చాలా అవసరమైనవి.మాంసకృత్తులు శరీర నిర్మాణానికి, పెరుగుదలకు ముఖ్యంగా పిల్లలలోను కౌమారదశలోను చాలా ఉపయోగకరం. పెద్ద వయస్సు లేక వృద్ధులలో మాంసకృత్తుల సహాయం చాలా అవసరం. పెద్దగాదెబ్బలు తగిలినా అవి మానిపోవడానికి సహాయ పడుతుంది. గర్భవతులు, బాలింతలు మాంసకృత్తులను అధికంగా తీసుకోవటం చాలా అవసరం. ఇవి బిడ్డ పెరుగుదలకు ఎంతో తోడ్పడుతాయి. ఆహారంలో మాంసకృత్తులు ఎంత తీసుకోవాలి?         మాంసకృత్తులు శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను తయారుచేస్తుంది.          ఎక్కువ శాతం మాంసకృత్తులు నూనె గింజలు, పప్పులు ,పందిరి చిక్కుళ్ళు, పాలు, పాలతోతయారైన పదార్ధాలు, జంతు మాంసము, చేపలు, కోడిమాంసము ద్వారా లభిస్తాయి.        శాఖాహారం తీసుకొనే వాళ్ళు తమకు సరిపడా మాంసకృత్తులను పప్పు ధాన్యాలు, పాలు, గుడ్డు నుంచి పొందవచ్చు.          వృక్షాల ద్వారా లభించే ఆహారంలో సోయాబీన్స్ లో చాలా ఎక్కువ శాతంలో అంటే ...

సుప్తవజ్రాసనము

చిత్రం
                      వజ్రాసనంలో నిద్రపోవటం ఈ ఆసనం ప్రాముఖ్యత 1. వజ్రాసనంలో కూర్చోవాలి. 2. మొట్ట మొదట కుడిమోచేతిని, చేతి ఆధారముగా  తరువాత ఎడమ మోచేతి ఆధారంగా వీపును బాగా వెనకకి ఉంచాలి. 3. తలపై భాగం నేలను అనుకునే విధంగా వెనకభాగము విల్లువలె వంచాలి. 4. రెండు చేతులను తొడలపై ఉంచాలి. 5. మోకాళ్ళను నేలకు తాకించినట్లుగా ఉండాలి. అవసరమనుకుంటే మోకాళ్ళను ఎడంగా పెట్టుకో వచ్చు. ఆ సమయం మోకాలి కండరాలకి, తొడలకి ఎక్కువ వత్తిడి కలగకుండ చూసుకుని కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వండి. 6. శ్వాసను నెమ్మదిగా తీసుకోండి. కాళ్ళను క్రమంగా సాగదీయకుండా ఈ స్థితిలోకి రాకండి. లేకపోతే మోకాలి కీళ్ళు బెణికే అవకాశముంది.ఒక నిమిషం తరువాత వజ్రాసనంలోకి రావాలి. తరువాత కాళ్ళను సాగదీయాలి.    గమనిక: తుంటి నొప్పి గలవారు, కీళ్ళు సడలినవారు, మోకాలి సంబంధమైన బాధలు గలవారు ఈ ఆసనం వేయకూడదు. ప్రయోజనాలు 1. జీర్ణక్రియను, శుద్ధపరిచి మలబద్ధకమును నివారిస్తుంది. ఉదరభాగ అవయవాలకు వ్యాయామం కలిగిస్తుంది. వీపు క్రింది భాగానికి, ఉదరభాగానికి మంచి ప్రయోజనం....

ఉష్ట్రాసనము

చిత్రం
                         ఈ ఆసనంతో శరీరంలోని పిక్కలు గట్టిగా వజ్రంలా తయారవుతాయి. 1. వజ్రాసనంలో కూర్చోవాలి  2. మోకాళ్ళపై నిలబడి ఊపిరిపీల్చుతూ శరీరము వెనకకి వంచాలి. 3. నెమ్మదిగా కుడిచేతిని అరికాలిమీద, ఎడమచేతిని ఎడమ అరికాలు మీద వచ్చి ఉంచాలి. ఉదరభాగాన్ని వీలయినంతవరకు ముందుకి తీసుకువస్తూ తొడలను వంచటానికి ప్రయత్నిస్తూ తలను వెన్నెముకకి సాధ్యమైనంత వెనకకి వంచాలి. శరీరభారం మొత్తం కాళ్ళమీద చేతుల మీద ఉంటుంది. 4. వీలయినంత వరకు ఈ స్థితిలో ఉండాలి. 5. నెమ్మదిగా ఒక చేతిని ఒక మోకాలిని నుంచి వేరొక చేతిని వేరొక మోకాలి నుంచి విడదీయాలి. పై ప్రకారంగా 3 సార్లు చేయాలి. గమనిక: విపరీతమైన నడుము నొప్పి గలవారు సరైన గురువు ఆధ్వర్యంలో తప్ప వేయరాదు.థైరాయిడ్ గ్లాండ్ వ్యాకోచము చెందినవారు ఈ ఆసనము వేయరాదు. ప్రయోజనాలు:           జీర్ణక్రియ, పునరుత్పత్తి విధానాలకు అనుకూలం. పొట్టప్రేవుల్ని సాగదీసి మలబద్ధకాన్ని నివారిస్తుంది. వెనకకి వంగుట వలన వెన్నెముక నరాలకి సామర్ధ్యము పెరిగి, నడుము నొప్పి, భుజాలనొప్పిని నివారిస్తుంది. మె...